కాన్పూర్ : సిరీస్ ఫలితం తేల్చే చివరి వన్డే కోసం భారత్, వెస్టిండీస్ జట్లు మంగళవారం కాన్పూర్ చేరుకున్నాయి. చాలా రోజుల తర్వాత వచ్చిన టీమిండియాకు నిర్వాహకులు సాంప్రదాయ స్వాగతం పలికారు. ఆటగాళ్లు బస చేసే హోటల్లో ప్రత్యేకంగా ఓ కేక్ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు టీమ్స్ 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో చివరి వన్డే కీలకంగా మారింది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో అనూహ్యంగా టీమిండియాకు షాకిచ్చిన వెస్టిండీస్.. ఆ కొత్త ఉత్సాహంతో మూడో వన్డే మ్యాచ్ కోసం బరిలోకి దిగుతోంది. అటు ఈ ఏడాది వరసగా ఏడో వన్డే సిరీస్ గెలవాలని ధోనీసేన ఉబలాటపడుతోంది.