ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.52,250 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 25న ఉదయం 7:45 గంటలకు ప్రధాని ద్వారకా ఆలయాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు. అనంతరం సుదర్శన్ వంతెనను సందర్శిస్తారు.
ప్రధాని మోదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ద్వారకలో రూ.4,150 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీని తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ రాజ్‌కోట్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌కోట్‌లోని రేస్ కోర్స్ గ్రౌండ్‌లో రూ. 48,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
ద్వారకలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఓఖా ప్రధాన భూభాగంతో బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు రూ. 980 కోట్లతో నిర్మించిన సుదర్శన్ సేతును జాతికి అంకితం చేయనున్నారు. ఇది దాదాపు 2.32 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. వదినార్, రాజ్‌కోట్-ఓఖా, రాజ్‌కోట్-జెతల్‌సర్-సోమ్‌నాథ్ మరియు జెతల్‌సర్-వాన్సజలియా రైలు విద్యుదీకరణ ప్రాజెక్టుల వద్ద పైప్‌లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.
ఫిబ్రవరి 26న దేశంలోని 550 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బండేల్‌లో రూ.307 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి స్టేషన్‌ను నిర్మించనున్నారు.టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లోని 28 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment