
రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆడమ్ జంపాకే ఔటయ్యాడు. ఆడమ్ జంపా వేసిన 44 ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లి కొట్టిన ఆ షాట్‌ను చూసి సిక్స్ అనుకున్నారంతా. కాగా, కోహ్లిని దురదృష్టం వెంటాడింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆగర్ ఆ బంతిని బౌండరీ లైన్‌కు కాస్త వెలుపల పట్టుకుని దాన్ని మరో ఫీల్డర్ స్టార్క్‌కు విసిరేశాడు. ఇది ఆగర్ బౌండరీ లైన్‌ను దాటకముందే స్టార్క్ కు అందివ్వడంతో కోహ్లి పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఆగర్ కాలు గాల్లో ఉండగానే స్టార్క్‌కు ఇవ్వడంతో కోహ్లి ఔటయ్యాడు.
దాంతో కోహ్లి 78 వ్యక్తిగత పరుగుల వద్ద నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. 76 బంతుల్లో 6 ఫోర్లు మాత్రమే కొట్టిన కోహ్లి.. ఎక్కువగా సింగిల్స్, డబుల్స్ తీయడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే జంపా బౌలింగ్‌లో కోహ్లి ఔట్ కావడం వన్డేలు, టీ20ల్లో కలుపుకుని ఇది ఏడోసారి. భారత స్కోరు 276 పరుగుల వద్ద కోహ్లి నిష్క్రమించగా, ఆపై వచ్చిన మనీష్ పాండే(2) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment