రాజ్‌కోట్‌ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం | 33 People Died In Rajkot Game Zone's Horrific Fire Accident | Sakshi
Sakshi News home page

రాజ్‌కోట్‌ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Published Sun, May 26 2024 11:16 AM | Last Updated on Sun, May 26 2024 12:09 PM

33 People Died In Rajkot Game Zone's Horrific Fire Accident

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తాజాగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. 

కాగా, శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీకెండ్‌ కావడంతో​ భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వచ్చారు. వారంతా ఆటల్లో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వారని చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో గేమ్‌ జోన్‌ పైకప్పు కూలిపోవడంతో లోపల ఉన్న వారంతా బయటకు రాలేకపోయారు. 

ఈ క్రమంలో వారంతో మంటల్లో సజీవదహనమయ్యారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టం మారిందని అధికారులు వెల్లడించారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ కొందరు బాధితులు మృతిచెందారు. దీంతో, మృతిచెందిన వారి సంఖ్య 33కి చేరుకుంది. 

మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో గేమ్‌ జోన్‌ వద్దకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ వచ్చి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. 

ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారిలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌ యజమాని యువ్‌రాజ్‌ సింగ్‌ సోలంకితోపాటు దాని మేనేజర్‌ నితిన్‌ జైన్‌ కూడా ఉన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్‌ను నియమించింది. సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో సిట్‌ను నియమించగా.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement