
అహ్మదాబాద్ (రాజ్‌కోట్) : గుజరాత్‌లో ఫేక్‌పాస్‌ల గుట్టు రట్టయింది. కరోనావైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. దీన్ని ఆసరగా చేసుకున్న ఓ ముఠా ఫేక్ పాసులను సృష్టించి విక్రయిస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 17 మంది కలిసి ముఠాగా ఏర్పడి రూ.300లకు ఒక్కో పాస్‌ను అమ్ముతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫేక్‌పాస్‌లనుఅమ్ముతున్న ముఠాను పట్టుకున్నామని రాజ్‌కోట్ ఏసీపీ జేహెచ్ సార్వయా తెలిపారు. వారి నుంచి ఫేక్ పాసులను స్వాధీనం చేసుకుని, 17 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment