Fake passes
-
ఇండియన్ ఐడెల్ ఫేం షణ్ముఖ ప్రియ లైవ్ ఈవెంట్ కు ఎదురుదెబ్బ
-
ఫేక్ పాసుల ముఠా గుట్టురట్టు
అహ్మదాబాద్ (రాజ్‌కోట్) : గుజరాత్లో ఫేక్పాస్ల గుట్టు రట్టయింది. కరోనావైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. దీన్ని ఆసరగా చేసుకున్న ఓ ముఠా ఫేక్ పాసులను సృష్టించి విక్రయిస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 17 మంది కలిసి ముఠాగా ఏర్పడి రూ.300లకు ఒక్కో పాస్‌ను అమ్ముతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫేక్పాస్లనుఅమ్ముతున్న ముఠాను పట్టుకున్నామని రాజ్‌కోట్ ఏసీపీ జేహెచ్ సార్వయా తెలిపారు. వారి నుంచి ఫేక్ పాసులను స్వాధీనం చేసుకుని, 17 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నకిలీ పాసుల కలకలం
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గురువారం నకిలీ పాసుల వ్యవహారం కలకలం సృష్టించింది. నకిలీ పాసులతో ప్లాంట్‌లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. దాంతో గమనించిన అక్కడి భద్రతా సిబ్బంది ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్లాంట్‌కు సంబంధించిన నకిలీ పాసులను తయారు చేస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముడిసరుకు చోరీకి యత్నించడంతో ఈ పాసుల వ్యవహారం బయటపడినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతా అధికారులు వెల్లడించారు.