
రాజ్‌కోట్ : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల అజీడ్యామ్ గోడ సోమవారం కుప్పకూలింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అజీడ్యామ్ గోడ బ్రిడ్జి కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ఓ ట్రాలీ తృటిలో బయటపడింది. నాలుగు రోజుల క్రితం వచ్చిన నిసర్గ తుపాను ప్రభావంతో గుజరాత్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్లే అజీ డ్యామ్ గోడ పడిపోయినట్లుగా తెలుస్తోంది.