సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా వైరా-మధిర మధ్య భారీ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జిపై సిమెంట్ కాంక్రీట్ పోస్తుండగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా మండలం సోమవరం దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ శబ్దం రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
వంతెన మీద ఉన్న కూలీలు ప్రాణాలు రక్షించుకునేందుకు బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకంగా నిర్మించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హెచ్‌డీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment