రాజ్‌కోట్: దారంటా వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఎద్దు కుమ్మేసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్న వృద్ధుడిపై ముందుగా ఎద్దు దాడి చేసింది. ఊహించనివిధంగా ఎద్దు దాడి చేయడంతో బాధితుడు నిశ్చేష్టుడయ్యాడు. తేరుకున్నాక ఎద్దు బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా మరోసారి కుమ్మేసింది. అతడిని స్థానికులు పక్కకు తీసుకుపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
అక్కడే పొంచివున్న ఎద్దు.. బైకుపై వస్తున్న యువకుడిని కూడా కుమ్మేసింది. వెంటనే తేరుకున్న అతడు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులను ఎద్దును అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment