bull attack
-
శివ..శివా..! క్షణం ఆలస్యమైతే.. ప్రాణాలే పోయేవి..!
భూమ్మీద నూకలుంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. బెంగళూరులోని మహాలక్ష్మీపురం లేఅవుట్ ప్రాంతంలో పెద్దగా హడావిడి లేకుండా, ప్రశాతంగా ఉంది. అయితే ఇరుకైన రోడ్డులో ఓ మహిళ ఒక ఎద్దును తోలుకుంటూ వెడుతోంది. తాను ముందు పోతూ ఎద్దును తాడుతో లాగుతోంది. ఇంతలో ఉన్నట్టుండి ఆ ఎద్దు వింతగా ప్రవర్తించింది. బైక్‌పై ఎదురుగా వస్తున్న వాహనదారుడి పైకి దూకింది. ఏదో పగ బట్టినట్టు, కావాలని చేసినట్టు అతడిపై లంఘించింది. ఈ హఠాత్మపరిణామానికి అదుపుతప్పిన అతడు ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకుపోయాడు. అయితే లారీ డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, ఎద్దు కదలికలను గమనించిన డ్రైవర్ వేసిన బ్రేక్ పనిచేయక పోయినా అతగాడి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. అదృష్టవశవాత్తూ డ్రైవర్ అలర్ట్ అయి వాహనదారుడి ప్రాణాలను కాపాడాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. Bangalore: The bull suddenly attacked the scooty rider. The person fell under the truck coming from the front. The truck driver immediately applied the brakes. The man narrowly escaped being hit by the tire of the truck. pic.twitter.com/Jpiei3CoIL — Mayank Arhat 𝕏 (@iMayankIndian_) April 6, 2024 -
నడి రోడ్డుపై ఎద్దుతో పరాచకాలు... దెబ్బకు కుమ్మిపడేసింది: వీడియో వైరల్
జంతువులను ఇబ్బంది పెట్టే స్టంట్లు వంటివి చేయకూడదు. జంతు చట్టాలు ప్రకారం నేరం కూడా. ఐతే కొన్ని దేశాల్లో జంతువులతో చేసే ఫైట్లు, స్టంట్లు నేరం కాదు. పైగా అక్కడ చట్టాలు వాటిని ప్రోత్సహిస్తాయి. జంతువులకు జ్ఞానం ఉండదు కాబట్టి మనం ఏం చేస్తున్నామన్నది వాటికి తెలియదు. వాటితో స్టంట్లు చేయాలనుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మనకే ప్రమాదం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి వ్యవహారించి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. వివరాల్లోకెళ్తే....స్పెయిన్‌లోని ఒక వ్యక్తి ఎద్దుతో పరాచకాలు ఆడబోయి పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. నడిరోడ్డులో బహిరంగంగా ఆ ఎద్దును పట్టుకుని గేలి చేస్తూ....ఒక చేతితో దాని తలపై చేయి వేసి ఏదో చెప్పబోతుండగా సదరు ఎద్దు ఒక్క ఊదుటున తన కొమ్ములతో కుమ్మేసింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారందరూ భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. ఈ ఘటన స్పెయిన్‌లో వీధుల్లో చోటుచేసుకుంది. బుల్ ఫైట్ సందర్భంగా ఎద్దులను సిద్ధం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. అక్కడ కోడిపందాలు, బుల్పైట్లు చట్టబద్ధమని అక్కడ కోర్టులే చెబుతుండటం విశేషం. ఈమేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది
A shocking video Bull forceful way To Lift Lion: సహజంగా జంతవుల దాడి చేసుకుంటుంటాయి. అవి ఒక్కోసారి ఘోరంగా కూడా ఉంటాయి. అయితే పులి వేట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది వేటాడిందంటే ఏ జంతువైన దాని పంజా దెబ్బకి పడిపోవాల్సింది. చాలా వరకు ఏ జంతువునైనా అది సునాయాసంగా పట్టుకుని దాడి చేస్తుంది. ఏమైందో ఏమో ఈ ఎద్దు వద్ద ఆ సింహం ఆటలు సాగలేదు. పైగా దాన్ని చూసి పారిపోయింది. వివరాల్లోకెళ్తే...టాంజానియాలోని తరంగిరే నేషనల్ పార్క్‌లో ఒక ఎద్దు పైకి సింహం దాడి చేస్తుంది. ఆ ఎద్దుని గట్టిగా పట్టుకుంటుంది. కానీ ఆ ఎద్దుని విపరీతమైన కోపంతో ఆ సింహాన్ని కొమ్ములతో ఎత్తిపడేసి ఒక్కసారిగి దాడి చేసింది. ఆ సింహాన్ని పరిగెట్టెంత వరకు తరిమి తరిమి కొట్టింది. అయితే ఈ ఆ పార్క్ వద్దకు వచ్చిన కొంత మంది పర్యాటకు ఈ ఘటనను చిత్రించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Tanzania destination safari (@tanzania_destination_vacations) (చదవండి: భయంతో చెట్టెక్కిన సింహం... ఏ మాత్రం పట్టు తప్పినా అంతే!) -
అభం శుభం తెలియని చిన్నారి పైకి కుక్కను ఉసిగొల్పారు!...ఐతే చివరికి...
మన చుట్టుపక్కల వాళ్లు లేదా పక్కింటివాళ్లతో ఏదో చిన్న చిన్న విషయాలకే మాట మాట పెరిగి పెద్ద పెద్ద గోడవలకు దారితీసిన ఘటనలు మనం చూశాం. అయితే అవి అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఆ గొడవలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత తారాస్థాయికి చేరితేనే అందరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా సదోపూర్ గ్రామంలో పిట్ బుల్ కుక్క యజమానులు చూస్తుండగానే ఓ చిన్నారిపై దాడి చేసింది. అయితే ఆ మైనర్ బాలుడి కుటుంబంతో ఆ కుక్క యజమానులకు చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో కుక్క యజమానులైన రవీందర్, సౌరభ్‌లు వారి పెంపుడు కుక్క బుల్‌ని మైనర్ బాలుడి పైకి ఉసుగొల్పారు. అయితే స్థానికులు ఆ కుక్క బెదరగొట్టడానికి ముందుకు వస్తున్నప్పటికీ ఆ కుక్క యజమానులు మాత్రం జోక్యం చేసుకోకుండా అత్యంత పాశవికంగా నుంచుని చూశారు. పాపం ఆ కుక్క దాడిలో ఆ చిన్నారికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ఆ బాలుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ... రవీందర్ , సౌరభ్‌లను అరెస్టు చేశాం." అని తెలిపారు. (చదవండి: ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్) -
ఎద్దు దాడితో నుజ్జునుజ్జైన ముఖం.. 11 నెలలు.. 3 సర్జరీలు
జైపూర్: ముఖంపై చిన్న మొటిమ, మచ్చ ఏర్పడితే చాలా బాధ పడతాం. దాన్ని తొలగించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే మనిషి అందానికి మొహమే ప్రతీక. కనుక ముఖ సౌందర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. అలాంటిది అనుకోని ప్రమాదంలో ముఖం పూర్తిగా చిధ్రమైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ వ్యక్తికి. ఊహించని ప్రమాదంంలో అతడి ముఖం నుజ్జు నుజ్జయ్యింది. పూర్తిగా రూపు కోల్పోయిన ముఖానికి పూర్వపు ఆకారం తీసుకురావడం కోసం డాక్టర్లు ఎంతో శ్రమించి.. అనేక సర్జరీలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. దాడి జరగడానికి ముందు బిష్ణోష్ (ఫైల్ ఫోటో) రాజస్తాన్‌లోని బికనీర్‌కు చెందిన కర్ణీ బిష్ణోయ్ స్థానిక ఎఫ్ఎంసీజీ కంపెనీలో ఆపరేటింగ్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో బిష్ణోయ్ తన సోదరి, స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా వారి వాహనానికి ముందు కొన్ని ఎద్దులు వచ్చాయి. దాంతో బిష్ణోయ్ కారు వేగాన్ని తగ్గించి.. నెమ్మదిగా వెళుతున్నాడు. ఈ క్రమంలో కారు అద్దం సగం దించి ఉండటంతో.. అటుగా వెళ్తున్న ఎద్దు ఒక్కసారిగా బిష్ణోయ్ ముఖాన్ని కొమ్ములతో కుమ్మింది. అతడిని కారు నుంచి బయటకు లాగి పడేసింది. ఆ దాడిలో బిష్ణోయ్ కుడి కన్ను, ముక్కుతో పాటు ముఖం కుడి భాగమంతా నుజ్జునుజ్జయింది. ఈ దాడిలో బిష్ణోయ్ స్నేహితునికి స్వల్ప గాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుకుంటున్న బిష్ణోయ్‌ను అతని సోదరి బికనీర్‌లోని ఆస్పత్రికి తరలించింది. ప్రాథమిక చిక్సిత్సనందించిన వైద్యులు.. అతడికి చికిత్స ఇవ్వడం తమ వల్ల కాదని.. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో బిష్ణోయ్‌ని సాకేత్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక అతడి పరిస్థితి చూసి షాకయినట్లు సీనియర్ న్యూరో సర్జన్ తెలిపారు. అప్పటికే అతడి వెంటిలేషన్ ట్యూబ్ బ్లాక్ అయిటన్లు వైద్యులు గుర్తించారు. వెంటనే న్యూరో సర్జన్లు, ప్లాస్టిక్ సర్జన్లు పిలిపించారు. కరోనా నిబంధనలను అనుసరించి పీపీఈ కిట్లు ధరించిన వైద్యులు సుమారు పదిగంటల పాటు శ్రమపడి అతని ముఖానికి సర్జరీ చేశారు. అప్పటికీ ముక్కలు ముక్కలైన అతని ముఖం ఎముకలు, ముక్కులను అతికించారు. తొమ్మిది గంటలపాటు నిర్వహించిన మరో సర్జరీతో అతని ప్రాణాలు కాపాడటమే కాకుండా ముఖం తిరిగి ఒక రూపు సంతరించుకుంది అని తెలిపారు వైద్యులు. ఆ తర్వాత మరో నాలుగు నెలల అనంతరం మరో సర్జరీ నిర్వహించారు. అప్పటికే అతని ముఖం కుడి భాగమంతా పక్షవాతానికి గురైంది. భారత్‌లో మొదటిసారిగా నుదిటి కండరాలకు తేలికపాటి చికిత్సను అందించినట్లు వైద్యలు తెలిపారు. జులై నాటికి బిష్ణోయ్ తన కుడి కనుబొమ్మను, నుదిటిని కదపగలిగాడు. నెమ్మదిగా అతని ముఖం కూడా పూర్తిగా మానవరూపాన్ని సంతరించుకుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ కన్నుతో ఉన్న అతనికి మరికొన్ని సర్జరీలు చేయాల్సి వుందని అన్నారు. -
ఎద్దు నుంచి నాన్నమ్మను కాపాడిన బుడతడు
చండీఘర్: ప్రస్తుతం సోషల్‌మీడియా ఇప్పుడు ఒక బుడ్డోడిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఒక పిచ్చి పట్టిన ఎద్దు బారి నుంచి తన నాన్నమ్మను కాపాడటంతో అందరూ ఆ పిల్లడిని అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నడుచుకుంటూ వస్తున్న వృద్ధ మహిళను ఒక ఎద్దు పొడిచి కిందపడేసింది. దాంతో వెంటనే ఆమె మనుమడు పరిగెత్తుకుంటూ వాళ్ల నాన్నమ్మ దగ్గరకు వచ్చాడు. మార్గ మధ్యలో ఆ ఎద్దు ఆ పిల్లవాడిని కూడా పొడిచి నేలపై పడేలా చేసింది. అయితే భయంతో ఆ బాలుడు పారిపోకుండా వాళ్ల నాన్నమ్మను పైకి లేపాడు. అంతటితో ఆగకుండా ఆ ఎద్దు వారిని మళ్లీ వారిని పొడిచింది. ఈ లోపు చుట్టు పక్కల వారు వచ్చి వారిని ఎద్దు బారి నుంచి కాపాడారు. ఎద్దు దాడి చేస్తున్న భయపడకుండా తన నాన్నమ్మను కాపాడిన పిల్లోడి ధైర్యసాహసాలు, నాన్నమ్మ పట్ల ఉన్న ప్రేమ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ పిల్లవాడిని పొగడ్తాలతో ముంచెత్తుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చదవండి: బాక్సర్‌నే ఆశ్చర్యపరుస్తున్న బుడ్డోడు! -
సెన్సెక్స్ లాంగ్‌జంప్...1000 పాయింట్లు అప్
ఒక్క రోజులో మే నెల డెరివేటివ్ సిరీస్ ముగియనుండగా దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి జోరందుకున్నాయి. బుల్ ఆపరేటర్లు కదం తొక్కడంతో సెన్సెక్స్ ఏకంగా 1,000 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ సైతం దాదాపు ట్రిపుల్ సెంచరీ చేసింది. తొలుత బలహీనంగా ప్రారంభమైనప్పటికీ సమయం గడిచేకొద్దీ మార్కెట్లు పరుగందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 996 పాయింట్లు జమ చేసుకుని 31,605 వద్ద నిలవగా.. నిఫ్టీ 286 పాయింట్లు ఎగసి 9,315 వద్ద ముగిసింది. ఇది దాదాపు రెండు వారాల గరిష్టంకాగా.. సెన్సెక్స్ తొలుత 30,526 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తదుపరి జోరందుకుని 31,660ను అధిగమించింది. ఇది 1050 పాయింట్ల వృద్ధికిగా.. నిఫ్టీ సైతం ఒక దశలో 9334 వద్ద గరిష్టాన్ని చేరుకోగా, 9004 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల దుమ్మురేపాయి. దీంతో మార్కెట్లకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. గురువారం(28న) డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న కారణంగా బ్యాంకింగ్ కౌంటర్లలో ట్రేడర్లు భారీ షార్ట్ కవరింగ్ చేపట్టినట్లు తెలియజేశారు. ఐటీ, రియల్టీ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్ 7.5 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్ 3.4 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఐటీ దాదాపు 3 శాతం ఎగసింది. ఈ బాటలో రియల్టీ 2 శాతం పుంజుకోగా.. ఫార్మా స్వల్పంగా 0.2 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్ బ్యాంక్ 14 శాతంపైగా దూసుకెళ్లగా.. ఐసీఐసీఐ, విప్రో, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్, యూపీఎల్, కొటక్ మహీంద్రా, బీపీసీఎల్ 9-5 శాతం మధ్య జంప్‌చేశాయి.అయితే సన్ ఫార్మా, అల్ట్రాటెక్, జీ, టైటన్, ఏషియన్ పెయింట్స్, శ్రీసిమెంట్, మారుతీ 2-0.5 శాతం మధ్య నీరసించాయి. చోళమండలం అప్ డెరివేటివ్స్‌లో చోళమండలం, బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్, ఫెడరల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, కెనరా బ్యాంక్ 10-6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క టొరంట్ ఫార్మా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఐజీఎల్, బయోకాన్, టొరంట్ పవర్, ఎస్బీఐ లైఫ్, లుపిన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్ 7-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1380 లాభపడగా.. 946 నష్టపోయాయి. కొనుగోళ్లవైపు.. నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4716 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1354 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైతం రూ. 344 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
ఇద్దర్ని కుమ్మేసింది.. వైరల్ వీడియో
రాజ్‌కోట్: దారంటా వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఎద్దు కుమ్మేసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్న వృద్ధుడిపై ముందుగా ఎద్దు దాడి చేసింది. ఊహించనివిధంగా ఎద్దు దాడి చేయడంతో బాధితుడు నిశ్చేష్టుడయ్యాడు. తేరుకున్నాక ఎద్దు బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా మరోసారి కుమ్మేసింది. అతడిని స్థానికులు పక్కకు తీసుకుపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అక్కడే పొంచివున్న ఎద్దు.. బైకుపై వస్తున్న యువకుడిని కూడా కుమ్మేసింది. వెంటనే తేరుకున్న అతడు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులను ఎద్దును అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
దూసుకొచ్చిన ఎద్దు.. హేమమాలినికి తప్పిన ప్రమాదం
-
హేమమాలినికి తప్పిన ప్రమాదం
మథుర : సీనియర్ నటి, పార్లమెంట్ సభ్యురాలు హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం సాయంత్రం మథుర రైల్వే స్టేషన్ లో ఆమె ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. ఆ సమయంలో ఓ ఎద్దు ఆమె వైపుగా దూసుకొచ్చింది. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. జాతీయ మీడియా ద్వారా వైరల్ అయిన ఆ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆమె స్టేషన్ లో నడిచి వస్తుండగా, ఓ ఎద్దు అదుపు తప్పి స్టేషన్ లోకి దూసుకొచ్చింది. అదుపు చేసే యత్నంలో అది ముందుకు పరుగు తీసింది. ఆమెతో ఉన్న పోలీస్ అధికారులు ఆమె చుట్టూ నిలబడి, ఆమెను పక్కకు తప్పించారు. ఇక ఎద్దు కూడా పక్కనుంచి వెళ్లిపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే స్టేషన్ లో పశువులు తిరగడంపై హేమమాలిని అధికారులపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ముంబై ఎల్పిన్స్టోన్ బ్రిడ్జి ఘటన అనంతరం ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లోని రైల్వే స్టేషన్ల ను దర్శించి సౌకర్యాలను, పరిస్థితులను సమీక్షించాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమామాలిన మధుర స్టేషన్‌ను దర్శించారు. హేమమాలిని వైపుగా దూసుకొచ్చిన ఎద్దు -
ఎద్దులు కుమ్మేశాయ్.. ప్రాణాలు తీసిన జల్లికట్టు
పుదుక్కొట్టాయ్: తమిళనాడులోని ఓ ప్రాంతంలో నిర్వహించిన జల్లికట్టు విషాదంగా మారింది. ఇందులో పాల్గొన్న వ్యక్తులను ఎద్దు కుమ్మేయడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 56మంది గాయాలపాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం తిరువప్పూర్ జిల్లాలో ఆదివారం నేపథ్యంలో ఆటవిడుపుగా జల్లికట్టు నిర్వహించారు. అదే సమయంలో ఇక్కడ ఉన్న ఆలయంలో ఉత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో చుట్టుపక్కల నుంచి జల్లికట్టును చూసేందుకు వచ్చారు. సరిగ్గా క్రీడను ప్రారంభించగా ఎద్దులను అదుపుచేసేందుకు ప్రయత్నించే క్రమంలో అవి తిరగబడ్డాయి. పాల్గొన్నవారితోపాటు చూస్తున్నవారిపైకి కూడా అవి లంఘించడంతో జనాలు బెంబేలెత్తిపోయారు. తొలుత గాయపడినవారిని ఆయా ఆస్పత్రులకు తరలించడంతోపాటు మొబైల్ అంబులెన్సుల్లో చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ప్రాణాలుకోల్పోయారు. -
ఎద్దు దాడిలో రైతు మృతి
అర్ధవీడు: ఎద్దు దాడి చేయడంతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని బొమ్మిలింగం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. పేర్లకుంట వెంకటసుబ్బారెడ్డి(45) బుధవారం అరక దున్నేందుకు పొలం వెళ్లాడు. ఎద్దులను సరి చేస్తుండగా ఒకటి దాడి చేసి పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. సమాచారం తెలుసుకొన్న అర్ధవీడు ఎస్సై రాములునాయక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.