జంతువులను ఇబ్బంది పెట్టే స్టంట్‌లు వంటివి చేయకూడదు. జంతు చట్టాలు ప్రకారం నేరం కూడా. ఐతే కొన్ని దేశాల్లో జంతువులతో చేసే ఫైట్‌లు, స్టంట్‌లు నేరం కాదు. పైగా అక్కడ చట్టాలు వాటిని ప్రోత్సహిస్తాయి. జంతువులకు జ్ఞానం ఉండదు కాబట్టి మనం ఏం చేస్తున్నామన్నది వాటికి తెలియదు. వాటితో స్టంట్‌లు చేయాలనుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మనకే ప్రమాదం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి వ్యవహారించి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు.
వివరాల్లోకెళ్తే....స్పెయిన్‌లోని ఒక వ్యక్తి ఎద్దుతో పరాచకాలు ఆడబోయి పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. నడిరోడ్డులో బహిరంగంగా ఆ ఎద్దును పట్టుకుని గేలి చేస్తూ....ఒక చేతితో దాని తలపై చేయి వేసి ఏదో చెప్పబోతుండగా సదరు ఎద్దు ఒక్క ఊదుటున తన కొమ్ములతో కుమ్మేసింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారందరూ భయంతో కేకలు వేయడం ప్రారంభించారు.
ఈ ఘటన స్పెయిన్‌లో వీధుల్లో చోటుచేసుకుంది. బుల్ ఫైట్ సందర్భంగా ఎద్దులను సిద్ధం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. అక్కడ కోడిపందాలు, బుల్‌పైట్‌లు చట్టబద్ధమని అక్కడ కోర్టులే చెబుతుండటం విశేషం. ఈమేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment