ఎద్దు దాడి చేయడంతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని బొమ్మిలింగం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది.
అర్ధవీడు: ఎద్దు దాడి చేయడంతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని బొమ్మిలింగం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. పేర్లకుంట వెంకటసుబ్బారెడ్డి(45) బుధవారం అరక దున్నేందుకు పొలం వెళ్లాడు. ఎద్దులను సరి చేస్తుండగా ఒకటి దాడి చేసి పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. సమాచారం తెలుసుకొన్న అర్ధవీడు ఎస్సై రాములునాయక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.