ఎద్దులు కుమ్మేశాయ్‌.. ప్రాణాలు తీసిన జల్లికట్టు | Bull Tamer Among Two Gored to Death in Jallikattu Event, Over 50 hurt | Sakshi
Sakshi News home page

ఎద్దులు కుమ్మేశాయ్‌.. ప్రాణాలు తీసిన జల్లికట్టు

Published Sun, Mar 5 2017 5:20 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

ఎద్దులు కుమ్మేశాయ్‌.. ప్రాణాలు తీసిన జల్లికట్టు

ఎద్దులు కుమ్మేశాయ్‌.. ప్రాణాలు తీసిన జల్లికట్టు

పుదుక్కొట్టాయ్‌: తమిళనాడులోని ఓ ప్రాంతంలో నిర్వహించిన జల్లికట్టు విషాదంగా మారింది. ఇందులో పాల్గొన్న వ్యక్తులను ఎద్దు కుమ్మేయడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 56మంది గాయాలపాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం తిరువప్పూర్‌ జిల్లాలో ఆదివారం నేపథ్యంలో ఆటవిడుపుగా జల్లికట్టు నిర్వహించారు. అదే సమయంలో ఇక్కడ ఉన్న ఆలయంలో ఉత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు.

పెద్ద మొత్తంలో చుట్టుపక్కల నుంచి జల్లికట్టును చూసేందుకు వచ్చారు. సరిగ్గా క్రీడను ప్రారంభించగా ఎద్దులను అదుపుచేసేందుకు ప్రయత్నించే క్రమంలో అవి తిరగబడ్డాయి. పాల్గొన్నవారితోపాటు చూస్తున్నవారిపైకి కూడా అవి లంఘించడంతో జనాలు బెంబేలెత్తిపోయారు. తొలుత గాయపడినవారిని ఆయా ఆస్పత్రులకు తరలించడంతోపాటు మొబైల్‌ అంబులెన్సుల్లో చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ప్రాణాలుకోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement