ఎద్దు నుంచి నాన్నమ్మను కాపాడిన బుడతడు | A Boy Saves His Grand Mother From Mad Bull in Haryana | Sakshi
Sakshi News home page

ఎద్దు నుంచి నాన్నమ్మను కాపాడిన బుడతడు

Published Wed, Sep 30 2020 8:49 PM | Last Updated on Thu, Oct 1 2020 11:55 AM

A Boy Saves His Grand Mother From Mad Bull in Haryana - Sakshi

చండీఘర్‌: ప్రస్తుతం సోషల్‌మీడియా ఇప్పుడు ఒక బుడ్డోడిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఒక పిచ్చి పట్టిన ఎద్దు బారి నుంచి తన నాన్నమ్మను కాపాడటంతో అందరూ ఆ పిల్లడిని అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నడుచుకుంటూ వస్తున్న  వృద్ధ మహిళను ఒక ఎద్దు పొడిచి కిందపడేసింది. దాంతో వెంటనే ఆమె మనుమడు పరిగెత్తుకుంటూ వాళ్ల నాన్నమ్మ దగ్గరకు వచ్చాడు. మార్గ మధ్యలో ఆ ఎద్దు ఆ పిల్లవాడిని కూడా పొడిచి నేలపై పడేలా చేసింది.

అయితే భయంతో ఆ బాలుడు పారిపోకుండా వాళ్ల నాన్నమ్మను పైకి లేపాడు. అంతటితో ఆగకుండా ఆ ఎద్దు వారిని మళ్లీ వారిని పొడిచింది. ఈ లోపు చుట్టు పక్కల వారు వచ్చి వారిని ఎద్దు బారి నుంచి కాపాడారు. ఎద్దు దాడి చేస్తున్న భయపడకుండా తన నాన్నమ్మను కాపాడిన పిల్లోడి ధైర్యసాహసాలు, నాన్నమ్మ పట్ల ఉన్న ప్రేమ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ పిల్లవాడిని పొగడ్తాలతో ముంచెత్తుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. 

చదవండి: బాక్సర్‌నే ఆశ్చర్యపరుస్తున్న బుడ్డోడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement