ఢిల్లీ: టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. అతని తల్లికి ఆరోగ్యం బాగోలోద ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది.
తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతోనే అశ్విన్ మ్యాచ్ నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్‌కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్‌ఇండియా జట్టు అందిస్తుందని పేర్కొంది.
R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency.
— BCCI (@BCCI) February 16, 2024
In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR
ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఎక్స్(ట్విటర్) వేదికగా ఒక పోస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో తన తల్లికి దగ్గర ఉండడం కోసం అశ్విన్ రాజ్‌కోట్ నుంచి చెన్నై వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మ్యాచ్‌లో అశ్విన్ శుక్రవారం ఒక వికెట్ తీసి 500 వికెట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా ఘనతకెక్కాడు. మూడో టెస్టులో అశ్విన్ 37 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇటువంటి తరుణంలో జట్టుకు అశ్విన్ దూరం కావడం పెద్దదెబ్బే.
Comments
Please login to add a commentAdd a comment