జాతీయ రైఫిల్‌ కొత్త అధ్యక్షుడిగా కాళికేశ్‌ | Kalikesh Narayan Singh Deo Elected As NRAI President | Sakshi
Sakshi News home page

జాతీయ రైఫిల్‌ కొత్త అధ్యక్షుడిగా కాళికేశ్‌

Published Sun, Sep 22 2024 3:13 PM | Last Updated on Sun, Sep 22 2024 3:24 PM

Kalikesh Narayan Singh Deo Elected As NRAI President

న్యూఢిల్లీ: జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) నూతన అధ్యక్షుడిగా కాళికేశ్‌ నారాయణ్‌ సింగ్‌ దేవ్‌ ఎన్నికయ్యారు. శనివారం కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన రైఫిల్‌ సంఘం జనరల్‌ బాడీ మీటింగ్ ఎన్నికల్లో ఒరిస్సాకు చెందిన మాజీ ఎంపి కాళికేశ్‌ 36–21 ఓట్ల తేడాతో ప్రత్యర్థి వి.కె.ధల్‌పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. 

కొన్నాళ్లుగా కాళికేశ్‌ ఎన్‌ఆర్‌ఏఐ రోజూవారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్పోర్ట్స్‌ కోడ్‌ ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యల్లో  ఎవరైనా గరిష్టంగా 12 ఏళ్లకు మించి పదవుల్లో ఉండటానికి వీలు లేదు. దీంతో 2010 నుంచి 2022 వరకు పలు దఫాలు అధ్యక్షుడిగా ఎన్నికైన రణీందర్‌ సింగ్‌ గతేడాది కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు.

అప్పటినుంచి సీనియర్‌ ఉపాధ్యక్షుడైన  కాళికేశ్‌ జాతీయ రైఫిల్‌ సంఘం వ్యవహారాలను చక్కబెట్టారు. తాజా ఎన్నికతో ఆయన 2025 వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. ఆయన తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన హయాంలోనే పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. అంతకుముందు జరిగిన రియో–2016, టోక్యో–2020 ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ఒక్క పతకం కూడా గెలుపొందలేకపోయారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement