ఐపీఎల్లోకి కొత్త టీమ్లు వచ్చాయి.. | Pune, Rajkot are new Indian Premier League teams for next two seasons | Sakshi
Sakshi News home page

ఐపీఎల్లోకి కొత్త టీమ్లు వచ్చాయి..

Published Tue, Dec 8 2015 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

ఐపీఎల్లోకి కొత్త టీమ్లు వచ్చాయి..

ఐపీఎల్లోకి కొత్త టీమ్లు వచ్చాయి..

ముంబై:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రెండు కొత్త జట్లు వచ్చాయి. వచ్చే రెండు సీజన్లలో పుణె, రాజ్కోట్ ఫ్రాంచైజీలు ఆడుతాయని మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. బెట్టింగ్ ఉదంతంలో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో ఈ రెండు జట్లను తీసుకున్నారు.

పుణె టీమ్ను 16 కోట్ల రూపాయలకు న్యూ రైజింగ్ (సంజీవ్ గొయెంకా) సొంతం చేసుకోగా, రాజ్కోట్ జట్టును 10 కోట్ల రూపాయలకు ఇంటెక్స్ దక్కించుకుంది.  చెన్నై, రాజస్థాన్ జట్లలోని టాప్-5 ఆటగాళ్లను.. పుణె, రాజ్కోట్ ఎంపిక చేసుకునే అవకాశముంది. ఈ నెల 15న ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement