అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని రాజ్‌కోట్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక మునిసిపల్ అధికారుల తీరుపై కోర్టు మండిపడింది.
అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర అధికారులపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. అగ్నిప్రమాదం కేసును గుజరాత్ హైకోర్టు సోమవారం(మే27) విచారించింది. ఈసందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్‌ఎంసీ) అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది.
రెండున్నరేళ్లుగా మీ పరిధిలో ఇంత పెద్ద భవనం ఉందని.. అది కూడా ఫైర్‌సేఫ్టీ లేకుండా ఉందన్న విషయం కూడా తెలియదని ఎలా చెబుతారని జస్టిస్ బైరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్‌దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నట్లు మీడియా కథనాలను బెంచ్ చూపించింది. ఈ అధికారులు ఎవరు.. వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా అని మండిపడింది.
ఏడుగురు అధికారుల సస్పెన్షన్ ..
కాగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇద్దరు పోలీసులు సహా మొత్తం ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో రాజ్‌కోట్ మునిసిపల్ అధికారులు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment