నాలుగో టీ20కి ముందు టీమిండియా ప్లేయర్ల ముందున్న రికార్డులివే..! | IND VS SA 4th T20: Players Records And Approaching Milestones | Sakshi
Sakshi News home page

IND VS SA: నాలుగో టీ20కి ముందు టీమిండియా ప్లేయర్ల ముందున్న రికార్డులివే..!

Published Thu, Jun 16 2022 10:27 PM | Last Updated on Thu, Jun 16 2022 10:30 PM

IND VS SA 4th T20: Players Records And Approaching Milestones - Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో రేపు (జూన్‌ 17) జరుగబోయే నాలుగో టీ20కి ముందు టీమిండియా ప్లేయర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. 

  • రేపటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ మరో సిక్సర్ బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరతాడు. 
  • టీమిండియా వెటరన్‌ ప్లేయర్‌ దినేశ్‌ కార్తీక్‌ మరో 64 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 500 పరుగులను పూర్తి చేసుకుంటాడు. 
  • భువనేశ్వర్‌ కుమార్‌ మరో 4 వికెట్లు తీస్తే బుమ్రా (67వికెట్లు)ను అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.
  • పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి అక్షర్ పటేల్ ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే, 5 మ్యాచ్‌ల ప్రస్తుత టీ20 సిరీస్‌లో టీమిండియా 1-2తో వెనుకబడి ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా గెలుపొందగా, వైజాగ్‌లో జరిగిన మూడో టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
చదవండి: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్‌ దూరం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement