రాజ్‌కోట్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై గుర్తుతెలియని వ్యక్తి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ విసిరాడు. అది ఆయనకు తగలకుండా, తలపై నుంచి వెళ్లి ముందుపడింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
నగరంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా గర్బా వేడుకలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. నడుస్తూ అభివాదం చేస్తుండగా, ఇంతలో వెనుక నుంచి ప్లాస్టిక్ నీళ్ల సీసా దూసుకొచ్చింది. అది కేజ్రీవాల్ తల పైభాగం నుంచి ముందుకు వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆప్ మీడియా కో–ఆర్డినేటర్ తెలిపారు.
Water bottle thrown at #ArvindKejriwal in Rajkot, Gujarat. Delhi CM had come to attend Garba program. pic.twitter.com/AqX5VN6aMV
— Hemir Desai (@hemirdesai) October 2, 2022
Comments
Please login to add a commentAdd a comment