1 నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల అమ్మకాలు | Sales of electronic bonds from 1 | Sakshi
Sakshi News home page

1 నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల అమ్మకాలు

Published Fri, Dec 28 2018 5:01 AM | Last Updated on Fri, Dec 28 2018 5:01 AM

Sales of electronic bonds from 1 - Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్‌ బాండ్ల అమ్మకాలకు రంగం సిద్ధమైంది. 2019, జనవరి 1 నుంచి 10 వరకూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ఈ బాండ్లను జారీచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, గాంధీనగర్, పట్నా, చండీగఢ్, బెంగళూరు, భోపాల్, ముంబై, జైపూర్, లక్నో, చెన్నై, కోల్‌కతా, గువాహటి నగరాల్లోని 29 ఎస్బీఐ శాఖల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గత నవంబర్‌నాటికి 6విడతల్లో రూ.1,056.73 కోట్ల విలువైన బాండ్లను ప్రజలు కొనుగోలు చేశారంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement