
న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ అనుబంధ విభాగమైన ఎన్‌ఎస్‌ఈ ఇండిసెస్ మొదటిసారిగా మున్సిపల్ బాండ్ ఇండెక్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు నిధులు సమీకరణ కోసం జారీ చేసే మున్సిపల్ బాండ్లను ‘నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్’ ట్రాక్ చేస్తుంటుంది.
అన్ని రకాల మెచ్యూరిటీలు, ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్‌ల వివరాలు ఇందులో ఉంటాయి. శుక్రవారం బెంగళూరులో మున్సిపల్ డెట్ సెక్యూరిటీలపై సెబీ నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ సూచీని ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ సూచీలో 28 మున్సిపల్ బాండ్లు ఉన్నాయి. 10 మున్సిపల్ కార్పొరేషన్లు వీటిని జారీ చేశాయి. ఏఏ క్రెడిట్ రేటింగ్ విభాగంలో ఉన్నాయి. ఎంత మేర నిధులు చెల్లించాల్సి ఉందనే ఆధారంగా ఒక్కో బాండ్‌కు వెయిటేజీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్లు అభివృద్ధి ప్రాజెక్టులకు కావాల్సిన నిధులను ఇలా సెక్యూరిటీల జారీ ద్వారా సమీకరించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment