
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పారదర్శకత, జవాబుదారీతనం సాధించేందుకు తాము తీసుకుని వచ్చిన సంస్కరణల్లో ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టడం కీలక ముందడుగని కేంద్రం తెలిపింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలను వ్యతిరేకించింది. పాత విధానంలో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో అధిక భాగం అక్రమ మార్గాల్లో పోగైందేననీ, అదంతా లెక్కచూపని నల్లధనమని గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లను జారీ చేస్తూ కేంద్రం తీసుకున్న చర్యల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 5వ తేదీన మరో ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment