justified
-
మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు
సాక్షి, శివాజీనగర: డబ్బు కోసం స్నేహితున్ని హత్య చేసిన కేసులో ముంబైకి చెందిన ఇద్దరు యువతులతో పాటు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అర్జీని హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పును రద్దు చేయాలని, లేదా సవరించాలని దోషులు రోహిత్ కుమార్– జార్ఖండ్, శివానీ ఠాకూర్, ప్రీతి రాజ్ – ముంబై, వారీస్– బిహార్.. వేసుకున్న అప్పీల్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ వీ.వీరప్ప ధర్మాసనం కొట్టివేసింది. హత్య కేసు వివరాలు.. వివరాలు.. వారిస్, తుషార్ రాజస్థాన్‌లో కలసి చదువుతుండేవారు. ఇంజనీరింగ్ చదివేందుకు తుషార్ బెంగళూరుకు వచ్చాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన తుషార్‌ను కిడ్నాప్ చేయాలని వారిస్ కూడా బెంగళూరులో మకాం వేశాడు. ఇక్కడే ఉద్యోగం చేస్తున్న తన బంధువైన ప్రీతి, శివానిని తుషార్‌కు పరిచయం చేశాడు. నిందితులు 2011 జనవరి 14న తుషార్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసి వీరసాగర రోడ్డు నీలగిరి తోపులో పడేశారు. జనవరి 16న అతని తండ్రికి కాల్ చేసి మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం. రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తుషార్ తండ్రి బిహార్ నుంచి బెంగళూరుకు వచ్చి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. రైల్వేస్టేషన్ వద్ద డబ్బు ఇస్తామని పిలిపించగా రెండో నిందితుడు రోహిత్ వచ్చాడు. అతన్ని పట్టుకుని మిగతావారినీ అరెస్టు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ లో నేరం రుజువు కావడంతో 2014 నవంబరులో నలుగురికీ జీవిత ఖైదుని విధించింది. హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పుని సమర్థించింది. (చదవండి: భార్య నుంచి కాపాడాలని మొర ) -
ఎలక్టోరల్ బాండ్లపై కేంద్రం సమర్థన
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పారదర్శకత, జవాబుదారీతనం సాధించేందుకు తాము తీసుకుని వచ్చిన సంస్కరణల్లో ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టడం కీలక ముందడుగని కేంద్రం తెలిపింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలను వ్యతిరేకించింది. పాత విధానంలో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో అధిక భాగం అక్రమ మార్గాల్లో పోగైందేననీ, అదంతా లెక్కచూపని నల్లధనమని గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లను జారీ చేస్తూ కేంద్రం తీసుకున్న చర్యల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 5వ తేదీన మరో ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. -
నిజాంను సమర్థించడం చరిత్రను వక్రీకరించడమే..
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి నెహ్రూ యువ సంఘటన్ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు హన్మకొండ: సీఎం కేసీఆర్, కూతురు కల్వకుంట్ల కవిత ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని నెహ్రూ యువ సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం హన్మకొడ ఎన్జీవోస్ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలన నుంచి విమోచన కలిగిన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని భావితరాలకు తెలియకుండా చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రజలను దోచుకుని, అకృత్యాలకు, నిరంకుశ పాలన గావించిన నిజాం నవాబ్‌పై సీఎం కేసీఆర్‌కు, కూతురు కవితకు ప్రేమేందుకు పుట్టుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ గత చరిత్రను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళుతుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే తిరంగా ముగింపు యాత్ర నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తిరంగ యాత్ర ముగింపు సభ జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు ప్రత్యమ్నాయంగా బీజేపీ ఎదిగి అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ 15న మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో పాటు బీజేపీ బృందం పర్యటిస్తుందన్నారు. ఇక్కడ పరకాలలో నిర్మించిన స్మారక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఽసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు కాసర్ల రాంరెడ్డి, పెదగాని సోమయ్య, వెంకటేశ్వర్లు, తాళ్ళపల్లి కుమారస్వామి, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు.