'తెలంగాణ ఒత్తిడికి కమల్ నాథన్ కమిటీ తలొగ్గింది' | so many mistakes in kamalnathan committee list, says muralikrishna | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఒత్తిడికి కమల్ నాథన్ కమిటీ తలొగ్గింది'

Published Fri, Jul 3 2015 5:01 PM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

'తెలంగాణ ఒత్తిడికి కమల్ నాథన్ కమిటీ తలొగ్గింది' - Sakshi

'తెలంగాణ ఒత్తిడికి కమల్ నాథన్ కమిటీ తలొగ్గింది'

హైదరాబాద్: ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీ సమర్పించిన జాబితాలో అవకతవకలున్నాయని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులు కమిటీ జాబితాపై చర్చించడానికి సీఎస్ ను కలిశారు. తెలంగాణ ఉద్యోగుల ఒత్తిడికి కమల్నాథన్ కమిటీ తలొగ్గినట్టుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి చెందిన పలువురు సీనియర్ అధికారులను తెలంగాణకు కెటాయించారని మురళీకృష్ణ ఆరోపించారు. ఆ కమిటీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇద్దరు డిప్యూటీ సెక్రటరీలు, ఇద్దరు అదనపు సెక్రటరీలు, ఓ అసిస్టెంట్ సెక్రటరీని తెలంగాణకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళతామని మురళీకృష్ణ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement