రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపుకోసం ఏర్పాటుచేసిన సీఆర్ కమలనాథన్ కమిటీ మరోసారి భేటీ అయింది.
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపుకోసం ఏర్పాటుచేసిన సీఆర్ కమలనాథన్ కమిటీ మరోసారి భేటీ అయింది. ఈ భేటీని సోమవారం ఏపీ సెక్రటేరియట్ లో నిర్వహించగా దీనికి కమిటీ చీఫ్ కమలనాథన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఆర్ కృష్ణారావు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ కమిటీ ఏర్పాటయినప్పటి నుంచి ఇలా భేటీ కావడం ఇది 15వసారి. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనపై కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతోపాటు, ఇరు రాష్ట్రాల అధికారులు ఇచ్చిన నివేదనలు స్వీకరించింది. ఎస్పీఎఫ్, మెడికల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగుల విభజన విషయంలో ఉన్న ఫిర్యాదులను ఇరు రాష్ట్రాల కార్యదర్శులు త్వరలోనే పరిష్కరించుకోనున్నట్లు తెలిపారు.