'ఉద్యోగుల విభజనలో అనిశ్చితి తొలగించాలి'
Published Wed, Sep 10 2014 5:32 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM
హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో అనిశ్చితి తొలగించాలని ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ సూచించారు. కమలనాథన్ కమిటీతో ఏపీ సచివాలయం ఉద్యోగులు సమావేశమైన తర్వాత మాట్లాడుతూ.. ఈనెల 25లోగా ఉద్యోగుల విభజన పూర్తిచేయాలని కమిటీకి తెలియచేశామని ఆయన అన్నారు.
ఉద్యోగుల విభజన తర్వాత కూడా అనిశ్చితి కొనసాగితే మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతామని ఏపీ ఉద్యోగుల సంఘం హెచ్చిరించింది. ఉద్యోగుల విభజన, మార్గదర్శకాల ఏర్పాటు కోసం కమలనాథన్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement