సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగుల హాజరు పెరిగింది. లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో సహాయ కార్యదర్శి, పైస్థాయి అధికారులు అంతా ప్రతిరోజు విధులకు హాజరు కావాలని, సహాయ కార్యదర్శి స్థాయి దిగువ ఉద్యోగులు ఆయా విభాగాల్లో 33 శాతం మంది హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని శాఖల్లోనూ 33 శాతం మంది హాజరవుతున్నారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి 5 మాస్కులు పంపిణీ చేసింది. అధికారులు ప్రతి రోజు అన్ని విభాగాలను శుభ్రం చేయిస్తున్నారు. ప్రతి సెక్షన్‌లోనూ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సచివాలయం ఉద్యోగులకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే సచివాలయంలోకి సాధారణ విజిటర్లను అధికారులు అనుమతించడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment