
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) పనితీరుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు స్పందించింది. కృష్ణారావు చెబుతున్న విధంగా సీఎంవోను సంస్కరించే ఉద్దేశం ఉందో లేదో తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సీఎంవో రాజకీయ కార్యాలయంగా మారిపోయిందని.. దీన్ని సంస్కరించాల్సిన అవసరముందని, పారదర్శకంగా పనిచేసేందుకు ఓ నిర్దిష్ట విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఐవైఆర్ ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment