రుతుపవన వర్షాలు భారత ఉపఖండం అంతా వ్యాపిస్తాయి. కృత్రిమంగా ఏర్పడిన దేశ సరిహద్దులను ఈ వర్షాలు లెక్క చేయవు. కురిస్తే మొత్తం ఉప ఖండం అంతా కుంభ వృష్టి. లేకపోతే వర్షాభావ పరిస్థితులు, కరువు. ఈ సంవత్సరం అంతటా కుంభవృష్టి. ఇక దానితో పాటు వచ్చే వరదలు, మలేరియా డెంగీలాంటి అనారోగ్యాలు సరిహ ద్దుకు అటు ఇటు ఒకే రకంగా ప్రజలను పీడిస్తు న్నాయి. వర్షాకాలంలో పురపాలక శాఖ అసమర్థతతో ఉంటే మోకాలు లోతు లేదా నడుము లోతు నీళ్లలో రోడ్లపై నడవాల్సి ఉంటుంది. అది సింధ్ హైదరాబాద్ అయినా దక్కన్ హైదరాబాద్ అయినా. 70 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా భారత్–పాక్ దేశాలు ఈ ప్రాథమిక సమస్యలను అధిగమించడంలో విఫలమైనాయి. దీన్ని విస్మరించి రెండు దేశాలలో చర్చ ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ విషయంలో ఎవరి వాదన పైచేయిగా ఉన్నది అనే దానిపై నడుస్తుంది.
ప్రతి ఏటా జరిగే ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో అన్ని దేశాలు తమ దేశ పరిస్థి తులను, ప్రపంచంలోని ప్రధాన సమస్యలపై వారి విధానాన్ని వివరించడం ఆనవాయితీ. భారత ఉపఖండంలోని మూడు ప్రధాన దేశాల అధిపతులు సెప్టెంబర్ నెలలో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆ దేశ పురోగతి సమస్యల విషయం విశదీకరిస్తూ బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన మార ణహోమాన్ని గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశంతో సరిహద్దు సమస్య లేకపోవటం బంగ్లాదేశ్ తన అంతర్గత వ్యవహారాల మీద, దేశ అభివృద్ధి మీద పూర్తి దృష్టి సారించడానికి తోడ్ప డింది. ఈనాడు బంగ్లాదేశ్ ఆర్థికంగా చక్కని పురోగతి సాధిస్తున్నది. భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను, స్వచ్ఛభారత్ లాంటి ప్రధాన కార్యక్ర మాలను తన ఉపన్యాసంలో వివరించారు. ఎటొచ్చీ కొంత తేడాగా నడిచిన ఉపన్యాసం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ది.
పర్యావరణ సమస్యల గురించి ప్రస్తావనతో ప్రారంభమైన ప్రసంగం, అంతర్జాతీయ నల్లధన మార్పిడి ఏ విధంగా వారి దేశానికి నష్టం కలి గిస్తుందని వివరిస్తూ, ఇస్లామిక్ తీవ్రవాదం అసలు సమస్య కాదు పొమ్మన్నారు. ఇక ప్రధా నంగా తన ఉపన్యాసంలో కశ్మీర్ గురించి ప్రస్తా వించారు. కశ్మీర్ గురించి ఐక్యరాజ్యసమితి వేది కపై ప్రముఖంగా ప్రస్తావిస్తారు అని అందరూ ఊహించినప్పటికీ ఆయన ప్రసంగించిన విధా నం ఒక రాజ్యాధినేత ఐరాస వంటి అంతర్జా తీయ సంస్థలో ప్రసంగించాల్సిన స్థాయిలో లేదు. శాపనార్థాలతో సాగిన ఆయన ప్రసంగంలో.. 370 రద్దు వల్ల కశ్మీర్‌లో మారణహోమం జరుగు తోందని, ఈ సమస్య అణు యుద్ధానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. భారత్‌లోని ముస్లిం లను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు.
కశ్మీర్‌లో అటువంటి మారణహోమం జరగా లని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు ఇమ్రాన్ చెప్పకనే చెప్పారు. కశ్మీర్ వాసులకు నష్టం జరిగినా పర్వా లేదు మాకు రాజకీయ లబ్ధి కావాలనేది ఆయన కోరికగా కనిపిస్తుంది. ఇక అణు యుద్ధ ప్రస్తావన తీసుకురావడం ఒక రకంగా ఆయన అనుభవ రాహిత్యం చాటుతోంది. ఐక్యరాజ్య సమితి సభలో ఇటువంటి హెచ్చరిక చేసినందున దీనిని తీవ్రంగా పరిగణించి పాకిస్తాన్ అణు కేంద్రాల పైన ఐక్యరాజ్యసమితి పూర్తి నియంత్రణ తీసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక భారత దేశంలోని ముస్లింలను రెచ్చగొట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం ఆయన రాజకీయ అవివేకాన్ని చాటుతుంది. 370 ప్రకరణ తొలగింపును భార తదేశంలో మత ప్రాంతీయ విభేదాలకు అతీ తంగా ప్రజలందరూ సమర్థిస్తున్నారు అనే సత్యాన్ని ఆయన గుర్తించలేకపోయారు. ఐక్య రాజ్యసమితిలో ఈ విధంగా మాట్లాడినా, విలేకర్ల సమావేశంలో మాత్రం కశ్మీర్ సమస్య పరిష్కా రానికి భారత్‌తో యుద్ధం మార్గం కాదన్నారు. ఉన్న వాస్తవాన్ని గుర్తించి మరొక వేదికపై ప్రస్తా వించటం అభినందనీయం. సైన్యాన్ని అదుపులో పెట్టగలిగిన ప్రజా పాలకులు అధికారం చేపట్ట నంతవరకు పాకిస్తాన్ దేశ సమస్యలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది.
ఐవైఆర్ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘ ‘ iyrk45@gmail.com
ప్రాధాన్యతల లేమిలో భారత్–పాక్
Published Tue, Oct 15 2019 3:25 AM | Last Updated on Tue, Oct 15 2019 5:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment