ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఏపీ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఏపీ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలోని వివిధ బ్లాకులను ఆయన పరిశీలించారు. ఉద్యోగులు రాకపోకలు, సౌకర్యాలపై కృష్ణారావు ఆరా తీశారు. పారిశుధ్యానికి పెద్ద పీట వేయాలని.. అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గతంలోనూ ఐవైఆర్ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన విషయం తెలిసిందే.