ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాదికూడా సెర్చ్ దిగ్గజం గూగుల్‌లో టాప్-10 మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ రెజ్లర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన వినేష్ ఫోగట్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ టాప్ టెన్‌లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.
2024లో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా వెదికిన పదిమంది వ్యక్తులు
వినేష్ ఫోగట్
నితీష్ కుమార్
చిరాగ్ పాశ్వాన్
హార్దిక్ పాండ్యా
పవన్ కళ్యాణ్
శశాంక్ సింగ్
పూనమ్ పాండే
రాధికా మర్చంట్
అభిషేక్ శర్మ
లక్ష్య సేన్
ఇక ప్రపంచవ్యాప్తంగా, 2024లో గ్రహం మీద అత్యధికంగా వెదికిన వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిలిచారు, ఆ తర్వాతి స్థానాల్లో వేల్స్ యువరాణి కేథరీన్, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా ఉన్న కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో జేడీ వాన్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రాపర్ డిడ్డీ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment