searching
-
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్, తండ్రి సంతోష్ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు -
వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, పూనం పాండే ఎవరు? ఇదే తెగ వెదికేశారట!
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాదికూడా సెర్చ్ దిగ్గజం గూగుల్‌లో టాప్-10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ రెజ్లర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన వినేష్ ఫోగట్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ టాప్ టెన్‌లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.2024లో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా వెదికిన పదిమంది వ్యక్తులు వినేష్ ఫోగట్నితీష్ కుమార్చిరాగ్ పాశ్వాన్హార్దిక్ పాండ్యాపవన్ కళ్యాణ్శశాంక్ సింగ్పూనమ్ పాండేరాధికా మర్చంట్అభిషేక్ శర్మలక్ష్య సేన్ఇక ప్రపంచవ్యాప్తంగా, 2024లో గ్రహం మీద అత్యధికంగా వెదికిన వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిలిచారు, ఆ తర్వాతి స్థానాల్లో వేల్స్ యువరాణి కేథరీన్, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా ఉన్న కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో జేడీ వాన్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రాపర్ డిడ్డీ కూడా ఉన్నారు. -
2023లో ఎక్కువగా ఈ కార్ల కోసమే సెర్చ్ చేశారు
టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో ఎప్పుడు ఏం కావాలన్నా గూగుల్ సెర్చ్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ ఏడాది (2023లో) ఎక్కువ మంది గూగుల్‌లో ఏ కార్ల కోసం సెర్చ్ చేశారు, ఎన్ని దేశాల్లో సెర్చ్ చేశారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 👉2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన కార్ బ్రాండ్స్ జాబితాలో ప్రధానంగా జపనీస్ కార్ల తయారీ సంస్థ 'టయోటా' అగ్రస్థానం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 64 దేశాల్లో ఈ బ్రాండ్ కార్ల కోసం శోధించినట్లు తెలుస్తోంది. 👉ఆ తరువాత స్థానంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉంది. టెస్లా బ్రాండ్ కార్లను ప్రపంచంలోని సుమారు 29 కంటే ఎక్కువ దేశాలలో సెర్చ్ చేసినట్లు సమాచారం. ఇందులో కూడా ఎక్కువ టెస్లా మోడల్ 3, మోడల్ వై, సైబర్ ట్రక్ కోసం శోధించినట్లు సమాచారం. 👉ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన కంపెనీ బీఎండబ్ల్యూ. ప్రపంచంలోని 29 కంటే ఎక్కువ దేశాలలోని ప్రజలు ఈ బ్రాండ్ కార్ల కోసం సెర్చ్ చేశారని తెలుస్తోంది. గత ఏడాది ఎక్కువ సెర్చింగ్స్ పొందిన రెండవ కంపెనీకి నిలిచిన BMW ఈ ఏడాది మూడవ స్థానంలో నిలిచింది. 👉నాలుగవ స్థానంలో నిలిచిన 'ఆడి' కార్ బ్రాండ్ కోసం 7 దేశాల్లోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు సమాచారం. గత ఏడాది మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆడి సెర్చింగ్ విషయంలో నాల్గవ స్థానంలోనే నిలిచింది. 👉ఇక చివరగా ఐదవ స్థానం పొందిన కంపెనీ మెర్సిడెస్ బెంజ్. గత ఏడాది మూడవ స్థానం పొందిన బెంజ్.. ఈ ఏడాది 5వ స్థానంలో చేరింది. కేవలం ఆరు దేశాలలో మాత్రమే ఎక్కువగా ఈ కార్లను సెర్చ్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. -
లోకేష్ కోసం సీఐడీ వెతుకులాట..
-
చటుక్కున ఒక్కట్టిచ్చి లాక్కెళ్లింది..! వైరల్ వీడియో
అమ్మ ఎవరికైనా అమ్మే. అది మనిషికైనా కౄర జంతువుకైనా. బిడ్డ క్షణం కనిపించకపోతే అల్లాడిపోతోంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కన్నబిడ్డ కంటికి కనిపించేదాకా తల్లిడిల్లిపోతుంది. అమ్మకు తీరా బిడ్డ కనిపించగానే ఏమై పోయావురా..ఇంకొంచెం ఉంటే గుండె ఆగిపోయేది అంటూ ఒక్కటిస్తుంది ఉబికివస్తున్న కన్నీళ్లద్దుకుంటూ. మనలో ఇలాంటి సంఘటన దాదాపు అందరికి అనుభవమే. అచ్చం ఇలాగే చేసింది ఒక తల్లి పిల్లి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకపిల్లి తన పిల్లికూనను వెతుక్కుంటూ ఉంటుంది. ఇంతలో బుజ్జిది కనిపించగానే చటుక్కున ఒక్కటిచ్చి... నోటితో కరుచుకుపోయింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీన్ని ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదతోపాటు వేల కొంతమంది రీట్వీట్ చేశారు. A lost kitten and her mother found her, she slapped her and took her home. 😂pic.twitter.com/UNLA0LxOXC — Figen (@TheFigen_) September 28, 2023 -
నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్
డైమండ్ సిటీ సూరత్ డైమండ్ బిజినెస్‌కు పెట్టింది పేరని అందరికీ తెలుసు. అయితే తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి కోట్ల విలువైన డైమండ్లున్న ఒక వీడియో పోగొట్టు కున్నాడని వార్త వైరల్ అయింది. దీంతో డైమండ్ల కోసం వేట మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గుజరాత్లోనివరచ్చా ప్రాంతంలో ఒక వ్యక్తి అనుకోకుండా వజ్రాల ప్యాకెట్‌ను పడవేసుకున్నట్టు పుకార్లు వ్యాపించడంతో వజ్రాలకోసం ఎగబడ్డారు జనం. అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, కోట్ల విలువైన వజ్రాలు ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయాయనే వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. కొందరైతే ఏకంగా మార్కెట్ రోడ్డులోని దుమ్మును కూడా వదిలిపెట్టకుండా డైమండ్స్ కోసం వెతికేశారు. కొంతమంది వజ్రాలను దక్కించు కుని సంబరాలు చేసుకున్నారు. కానీ అవి నకిలీ వజ్రాలని తేలడంతో ఉసూరుమన్నారు. (మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?) అయితే తనకు దొరకింది నకిలీ వజ్రం అని తేలిందని, ఇది ఇమిటేషన్ జ్యూయల్లరీ, లేదా చీర పనిలో ఉపయోగించే అమెరికన్ డైమండ్ అని అరవింద్ పన్సేరియా వాపోయారు. ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్ అయి ఉంటుందన్నారు. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన మినీ బజార్ వరచ్చా ప్రాంతంలో వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్టు వదంతులు వ్యాపించాయని తెలుస్తోంది. #સુરત વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત થતા હીરા શોધવા લોકોની ભીડ થઈ. પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ હીરા CVD અથવા અમેરિકન ડાયમંડ છે..#Diamond #Surat #Gujarat pic.twitter.com/WdQwbBSarl — 𝑲𝒂𝒍𝒑𝒆𝒔𝒉 𝑩 𝑷𝒓𝒂𝒋𝒂𝒑𝒂𝒕𝒊 🇮🇳🚩 (@KalpeshPraj80) September 24, 2023 -
‘డెక్కన్’లో అగమ్యగోచరం! నాలుగో రోజూ లభించని ఆ ఇద్దరి అవశేషాలు
సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్ రాధా ఆర్కేడ్లోని ‘డెక్కన్ కార్పొరేట్ ’లో జరిగిన అగ్నిప్రమాదంలో గల్లంతైన ఉద్యోగుల అవశేషాలు ఆదివారం సాయంత్రానికి కూడా లభించలేదు. గల్లంతైన జునైద్, వశీం, జహీర్‌ల్లో శనివారం సాయంత్రం ఒకరి అవశేషాలు లభించగా, మరో ఇద్దరివి వెలికితీసే పనిలో పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అగ్నిప్రమాదం జరిగిన గురువారం నుంచి వేడి సెగలు కక్కుతున్న ఈ భవనం ఆదివారం నాటికి కాస్త చల్లబడింది. దీంతో డ్రోన్లకు బదులుగా నేరుగానే గాలింపు చేపట్టారు. అయితే ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కూలిన శ్లాబుల కింద రెండు మృతదేహాలు (అవశేషాలు) ఉండి ఉంటాయని భావిస్తున్నారు. శ్లాబులు పెద్ద పరిమాణంలో ఉన్న నేపథ్యంలో కూలీలు తీయలేకపోతుండటంతో జేసీబీ వంటివి వాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ యంత్రాలను వినియోగిస్తే శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ అంతస్తుల్లో ఆస్తి నష్టం కూడా జరగలేదు.. గాలింపు బృందాలు ఆదివారం భవనంలోని అన్ని అంతస్తులనూ పరిశీలించాయి. సెల్లార్–1, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండు, మూడో అంతస్తుల్లోని సరుకు మాత్రమే అగ్నికి ఆహుతైనట్లు గుర్తించారు. నాలుగో అంతస్తులో ఉన్న సామాను, సంచులతో పాటు ఐదు, ఆరో అంతస్తుల్లోని రహీం ఇంటిలోని ఫర్నీచర్ యథాతధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ పొగ, మసి చూరుకుపోవడం తప్పించి ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంటున్నారు. శనివారం లభించిన అవశేషాలతో పాటు ఆ ముగ్గురు యువకుల బంధువుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. చదవండి: అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు -
పొలిటికల్ కారిడార్: కాకినాడలో అభ్యర్థి కోసం టీడీపీ పాట్లు..
-
Kurnool: మొదలైన వజ్రాల అన్వేషణ
ఎక్కడైనా తొలకరి వర్షాలు కురవగానే పొలాల్లో పంట సాగు పనులు ప్రారంభమవుతాయి. కానీ పత్తికొండ ప్రాంతంలో మాత్రం వజ్రాలన్వేషణ మొదలవుతుంది. స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సైతం జనం ఇక్కడికి తరలివచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రెండురోజుల క్రితం కురిసిన చినుకులకు పుడమి తడవడంతో ఎప్పటిలాగే ఈసారి కూడా ఆశల వేటను మొదలు పెట్టారు. సాక్షి, కర్నూలు(తుగ్గలి): కరువుకు నిలయమైన పత్తికొండ నియోజకవర్గంలో ఏటా తొలకరిలో వజ్రాల పంట పండుతోంది. దాదాపు 40 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో వాటి అన్వేషణ కొనసాగుతోంది. మొదట్లో వ్యవసాయ పనులకు వెళ్లిన వారికి వజ్రాలు దొరికాయి. క్రమంగా ఇది వేటగా మారి పోయింది. అదృష్టం వరిస్తే క్షణాల్లో లక్షాధికారులు అవుతున్నారు. స్థానికులే కాకుండా వైఎస్సార్, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పలువురు ఇక్కడికి చేరుకొని వజ్రాన్వేషణ కొనసాగిస్తుంటారు. తొలకరి వర్షాలు కురవగానే తుగ్గలి మండలంలోని పగిడిరాయి, తుగ్గలి, రామాపురం, చిన్నజొన్నగిరి, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, గిరిగెట్ల, మద్దికెర మండలంలోని పెరవలి,బసినేపల్లి, మద్దికెర, అనంతపురం జిల్లాలోని బేతాపల్లి, ఊటకల్లు, బసినేపల్లి, వజ్రకరూర్ తదితర ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణ మొదలవుతుంది. వర్షాలు బాగా కురిస్తే తెల్లారేసరికి జనం పొలాల్లో వాలిపోతుంటారు. ఏటా విలువైన వజ్రాలు లభ్య మవుతుండడంతో జనం పిల్లాపాపలతో వచ్చి వెతుకుతుంటారు. దొరికిన వజ్రాలను కొందరు రహస్యంగా, మరికొందరు టెండరు పద్ధతి ద్వారా అమ్ముకుంటుంటారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కకట్టి నగదు, బంగారం ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తారు. గతేడాది విలువైన వజ్రం లభ్యం.. గతేడాది చిన్న జొన్నగిరికి చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభ్యమైంది. రూ.1.20 కోట్ల విలువైన డైమండ్ దొరికింది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన వజ్రం. వేలు, లక్షల విలువైన వజ్రాలు సైతం లభ్యమవుతుంటాయి. ప్రస్తుతం తొలకరి సీజన్ ప్రారంభం కావడంతో వ్యాపారులు కూడా తమ అనుచరులను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. ఎవరికైనా వజ్రం లభ్యమైనట్లు తెలియగానే తమ ఆసాముల వద్దకు తీసుకెళ్లడంలో అనుచరులు కీలక పాత్ర పోషిస్తారు. 2000 సంవత్సరంలో రాంపల్లిలో పొలం పనులకు వెళ్లిన వారికి విలువైన వజ్రం లభ్యమైంది. అయితే ఇద్దరి మధ్య తగాదా రావడంతో ఆ వజ్రాన్ని అప్పట్లో రెవెన్యూ అధికారులు ట్రెజరీకి పంపారు. ఈ ప్రాంతంలో ఏటా వజ్రాలు దొరుకుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా నిక్షేపాల కోసం అన్వేషించింది. చివరకు బంగారం నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది. 2013లో బంగారం నిక్షేపాల వెలికితీతకు జియోమైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది. చదవండి: (Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..?) వజ్రాన్వేషణతో రైతులకు అవస్థలు వజ్రాన్వేషణకు వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తుండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కురిసిన వర్షాలకు విత్తనం వేసుకునేందుకు పొలాలు దుక్కిదున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జనం తొక్కుతుండడంతో పొలాలు గట్టి పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. పైగా పొలాల్లో పనికోసం వెళ్లిన వారిపై కొందరు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వజ్రాన్వేషణకు వచ్చేవారిని నియంత్రించేందుకు గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. పొలాల్లో జనం తిరిగినా, సమీపంలో వాహనాలు నిలిపినా జరిమానాలు విధించాలని తీర్మానించుకున్నారు. వజ్రాన్వేషణకు ఎవరూ రావద్దని వస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. 8 ఏళ్ల నుంచి వస్తున్నాను వజ్రాలు వెతికేందుకు ప్రతి సంవత్సరం తొలకరిలో నేను ఇక్కడికి వస్తున్నాను. 8 ఏళ్ల నుంచి పొలాల్లో వెతుకుతున్నాను. ఈసారి మేము ఎనిమిది మంది వచ్చాం. మూడు, నాలుగు రోజులుండి తిరిగి ఊరెళ్లిపోతాం. – నాగరాజు, కారుడ్రైవరు, ఒంగోలు -
కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..?
సాక్షి, హైదరాబాద్(వెంగళరావునగర్): ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు, పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులు తెలిపిన మేరకు.. సినీనటి కరాటే కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతుందని 1098 నెంబర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు మహేష్, సంతోష్‌కుమార్ ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో శ్రీలక్ష్మినిలయం అపార్ట్‌మెంట్స్‌కు ఆదివారం వచ్చారు. ఆ సమయంలో కల్యాణి, పిల్లలు ఇంట్లో లేరు. కల్యాణి తల్లి మాత్రమే ఉంది. తన కూతురు గుడికి వెళ్లిందని, ఎప్పుడు వస్తుందో తెలియదని సమాధానం చెప్పింది. తన కుమార్తె ఒక బాబు (12 ఏళ్లు)ను, ఐదు నెలల పాపను పెంచుకుంటోందని, అందులో తప్పేముందని ప్రశ్నించింది. అయితే వారిని ఎక్కడనుంచి తెచ్చిందనే విషయం మాత్రం తనకు తెలియదని విలేకరులతో చెప్పారు. ఇదిలా ఉండగా చైల్డ్ లైన్ అధికారులు ఇంటివద్దకు విచారణకు వస్తున్నారని తెలిసిన కరాటే కల్యాణి ఎక్కడి వెళ్లింది ? ఎప్పుడు వస్తుంది ? దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాలను అటు అధికారులు, ఇటు పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: (కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు) -
ఆన్లైన్లో వెతుకుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అందుబాటు ధర, అభివృద్ధి చెందిన ప్రాంతం, అన్ని రకాల వసతులుంటే గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల కోసం ఆన్లైన్లో కొనుగోలుదారులు తెగ వెతికేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ కాస్త నెమ్మదించడంతో జూన్ నెలలో ఆన్లైన్లో సెర్చింగ్ విపరీతంగా పెరిగిందని రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ తెలిపింది. అంతకుముందు వరుసగా రెండు నెలలు క్షీణించాయని పేర్కొంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుంచి వాస్తవ డిమాండ్ సాధ్యమవుతుందని తెలిపింది. జూన్‌లో అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్ నగరంలో ప్రాపర్టీల కోసం ఆన్లైన్లో శోధనలు జరిగాయని గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. రెండో స్థానంలో ముంబై, ఆ తర్వాత వరుసగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లూథియానా, పుణే, గోవా, సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా, గౌహతి, వారణాసి, అమృత్సర్, కోయంబత్తూర్, పాటా్న, మీరట్, జైపూర్, కాన్పూర్, లక్నో ప్రాంతాలలోని గృహాల కోసం ఆన్లైన్లో వెతికారని రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో ఆన్లైన్ సెర్చింగ్ క్షీణించగా.. జూన్‌లో 9 పాయింట్లు పెరిగిందని తెలిపింది. -
దండకారణ్యంలో యుద్ధ మేఘాలు.. పోలీసు బలగాల కూంబింగ్..
సాక్షి,చర్ల(ఖమ్మం): దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. జూలై 28 నుంచి ఆగష్టు 3 వరకు మావోయిస్టులు పార్టీ అమరులకు నివాళులర్పించేందుకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు సరిహద్దు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుశాఖ భారీగా బలగాలను తరలించింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో ఆదివారం ఉదయం చర్ల మండల శివారు అటవీ ప్రాంత గ్రామమమైన బోదనెల్లి–కొండెవాడ గ్రామాల మధ్యలోని కామరాజుగుట్ట సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని బీజాపూర్, సుకుమా జిల్లాలతో పాటు దంతెవాడ జిల్లాలోని అటవీ ప్రాంతాలలోకి భారీగా చేరుకున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలు దండకారణ్య ప్రాంతంలో అణువణువునా గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున దండకారణ్య ప్రాంతాలలోని గ్రామాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో ఏ క్షణంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ ప్రజానీకం బిక్కుబిక్కుమంటున్నారు. సరిహద్దుల్లోని కొండెవాయి, బక్కచింతలపాడు, బోదనెల్లి, ఎర్రబోరు, కుర్నపల్లి, పులిగుండాల, నిమ్మలగూడెం, బత్తినపల్లి, ఎర్రంపాడు, చెన్నాపురం, రామచంద్రాపురం, కిష్ట్రారంపాడు, పూసుగుప్ప, దర్మపేట, ఎలకనగూడెం, డోకుపాడు, కర్రిగుండం, తెట్టెమడుగు, పాలచెలిమ, బీమారంపాడు, దర్మారం, యాంపురం, జెరుపల్లి తదితర గ్రామాలకు చెందిన కొంతమంది ఆదివాసీలు భయంతో ఇప్పటికే ఇళ్లను వదిలి వెళ్లారు. ఉన్న కొద్దిమంది కూడా తాజాగా బోదనెల్లి సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనతో భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్తేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 28న ప్రారంభమైన వారోత్సవాలు రేపటితో (ఆగష్టు 3) ముగియనున్న నేపధ్యంలో ఆగష్టు 3వ తేదీ ఎప్పుడు వెళ్లి పోతుందా అని ఆదివాసీలు ఎదురుచూస్తున్నారు. -
కలివికోడి కనిపించేనా..?
సాక్షి, అట్లూరు : కలివి కోడి అంటే మన జిల్లావాసులకు పరిచయం చేయనక్కరలేదు. కలివికోడి అంటే అట్లూరు మండలం అందరికీ గుర్తు వస్తుంది. సిద్దవటం రేంజ్ పరిధిలోని అట్లూరు మండలం కొండూరు బీట్ పరిధిలోని లంకమల్ల అభయారణ్యం ప్రాంతంలో 30 ఏళ్ల కిందట కలివికోడి కథ మొదలైంది. అప్పటి నుంచి అటవీశాఖ, ప్రత్యేక పరిశోధనా సంస్థల ప్రతినిధులు దీని ఉనికి కనుగొనేందుకు.. దాని ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కలివికోడి ఆవాసం కోసం అంటూ అట్లూరు, బద్వేలు మండలాల పరిధిలోని సుమారు మూడు వేల ఎకరాలకు సంబంధించి రూ.28 కోట్లు నష్టపరిహారం చెల్లించి రైతుల నుండి భూములు స్వాధీనం చేసుకున్నారు. సుమారు వందకు పైగా కెమెరాలను అమర్చి అన్వేషిస్తున్నారు. బాంబే హిస్టరీ నేషనల్ సొసైటీ లాంటి పలు సంస్థల ప్రతినిధులతో కొట్లాది రూపాయలు అదనంగా ఖర్చు చేసి అన్వేషిస్తున్నారు. దాదాపు రూ.50 కోట్లకు పైనే ఖర్చు చేసినట్లు సమాచారం. కలివి కోడి అన్వేషణ కోసం పరిశోధనా కేంద్రం... అరుదైన కలివికోడి జాడ కనుగొనేందుకు అట్లూరు మండల పరిధిలోని కొండూరు ఫా రెస్టు కార్యాలయ ప్రాంగణంలో 2013 నవంబరు నెలలో కలివికోడి పరిశోధనా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అడవిలో కలివికోడి ఉనికిని కనుగొనేందుకు అమర్చిన 177 కెమెరాలలో నమోదైన దృశ్యాలను ఈ కలివికోడి పరిశోధనా కేంద్రంలో పరిశీలించేందుకు రూపకల్పన చేశారు. అయితే 30 సంవత్సరాల అన్వేషిస్తున్నా.. దాని జాడ కపిపించడం లేదు. తెరపైకి మరో సంస్థ... గత కొన్నేళ్లుగా కలివికోడిని కనుగొనేందుకు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ సంస్థ పరిశోధనలు నిర్వహించి అది కనిపించక పోవడంతో రెండేళ్ల క్రితం వారు వెనుదిరిగారు. అయితే బెంగుళూరుకు చెందిన అశోక్‌ట్రస్టు రీచర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటు అనే సంస్థ కలివికోడి కోసం అన్వేషణ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. వారు అన్వేషణ సాగిస్తున్నారు. అన్వేషణ కొనసాగుతుంది.. గతంలో కలివికోడి ఉనికిని కనుగొనేందుకు బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ సంస్థ ద్వారా 177 కెమెరాలు అమర్చి కొన్నేళ్లపాటు శ్రమించారు. కలివికోడి కనిపించలేదు. ప్రస్తుతంలో బెంగూరుకు చెందిన అశోక్‌ట్రస్టు రీచర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటు సంస్థ అధునాతన వాయిస్ రికార్డర్లను అమర్చి కలివికోడి కూతలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 110 రకాల పక్షు జాతులకు సంబంధించిన కూతలు రికార్డు అయ్యాయి. ఆ రికార్డులను బెంగుళూరులో పరిశీలిస్తున్నారు. – ప్రసాద్, సిద్దవటం రేంజ్ అధికారి కలివి కోడి కథ గురించి తెలుసుకుందాం.. 1848లో బ్రిటీష్ సైనిక అధికారి పీసీ జోర్ధన్ కలివికోడిని కనుగొన్నారు. అయితే అరుదైన అంతరించిపోతున్న పక్షిజాతికి చెందిన పక్షిగా గుర్తించారు. అయితే ఈ పక్షిని ఆయన కనుగొనడంతో ఆయన పేరుతోనే జోర్ధన్ కోర్సర్‌గా ఆంగ్లేయ భాషలో నామకరణం చేశారు. అనంతరం 1871లో భద్రాచలం నదీపరివాహక ప్రాంతంలో పలుమార్లు ఆపక్షి దర్శనమిచ్చినట్లు అధికారులు చెపుతుంటారు. అయితే సిద్దవటం రేంజ్ కొండూరు బీటు పరిధిలో 1986 జనవరి నెలలో కలివిచెట్ల మధ్యలో ఐతన్న అనే వ్యక్తికి ఈ పక్షి దొరికింది. అయితే అది అప్పటికే చనిపోయినట్లు సమాచారం. అయితే అప్పటినుండి దీని ఉనికిని కనుగొనేందుకు అన్వేషణ మొదలైంది. అనంతరం 2008 సంవత్సరంలో మరో మారు కనిపించినట్లు అధికారులు చెపుతున్నారు. అయితే ఆధారాలు మాత్రం లేవు. అయినా నేటికీ అన్వేషణ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే అట్లూరు మండల పరిధిలోని కలివిచెట్ల పొదల మాటున తిరుగుతుందని పరిశోధనలలో తేలడంతో దీనిపేరు కలివికోడిగా ఇక్కడ పిలుస్తున్నారు. -
బిడ్డ కోసం ఓ పేద రైతు సైకిల్ యాత్ర
ఆగ్రా: కనిపించకుండాపోయిన కొడుకు కోసం ఓ నిరుపేద రైతు సైకిల్‌పై ఊరూరా తిరుగుతున్నాడు. వెతుకుతూ 1,500 కి.మీ. తిరిగాడు. ఇంకా తిరుగుతున్నాడు. యూపీలోని హథారస్ జిల్లా ద్వారికాపూర్‌లో 48 ఏళ్ల సతీశ్ చంద్ కొడుకు గోడ్నా జూన్ 24న స్కూలుకెళ్లి∙ తిరిగి రాలేదు. స్కూలు సిబ్బందిని అడిగితే సమాధానం లేదు. స్నేహితుల్ని అడిగితే స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర చూశామన్నారు. అక్కడా దొరకలేదు. దాంతో అప్పటి నుంచి 11ఏళ్ల కొడుకుకోసం వెతుకుతూనే ఉన్నాడు. ఢిల్లీ, హరియాణాల్లోని చాలాచోట్ల తిరిగాడు. ఐదు నెలలుగా వెతుకులాడుతూ ఆగ్రా సమీపంలోని ఎత్మద్‌పూర్ చేరుకున్నాడు. ‘జూన్‌లో పోలీస్ స్టేషన్‌కు వెళ్తే వారు ఫిర్యాదు స్వీకరించలేదు. బతిమాలిన తర్వాత తీసుకున్నారు. వారేదో చేస్తారని నేను వేచి చూస్తే గోడ్నా నాకు దక్కడని అర్థమైంది. దీంతో నేనే వెతుకులాట సాగించాను. సైకిల్‌పై తిరుగుతూ కనిపించిన వారినల్లా ‘ఈ ఫొటోలో అబ్బాయిని ఎక్కడైనా చూశారా’ అని అడుగుతున్నాను. నా దగ్గర కొంచెం డబ్బు మాత్రమే ఉంది. నాకెవరూ తెలియదు. నా లాంటి వాళ్లకు ఎవరు సహాయం చేస్తారు’’ అంటూ ఆవేదన చెందాడు. ఇప్పటివరకు 1,500 కిలోమీటర్ల మేర తిరిగానని, గోడ్నా జాడ తెలియరాలేదని చెప్పాడు. వందలాది గ్రామాల్లో తిరిగి, వేలాది మందిని అడిగానని తెలిపాడు. బాలల హక్కుల కార్యకర్త చొరవ చిరునవ్వులొలికిస్తున్న ఓ బాలుడి ఫొటో పట్టుకుని సైకిల్‌పై తిరుగుతూ.. అలసిపోయి, ఆకలితో, నిరాశలో కూరుకుపోయిన ఆ తండ్రి రోదన స్థానిక బాలల హక్కుల కార్యకర్త నరేశ్ పరాస్ వరకు వెళ్లింది. ఆయన చొరవ తీసుకుని ట్వీటర్ ద్వారా యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాయంత్రానికల్లా వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. అలాగే యూపీ ముఖ్యమంత్రి ప్రారంభించిన జన్‌సున్‌వాయ్ పోర్టల్లోనూ ఫిర్యాదు చేశారు. ‘నా పెద్ద కూతురు సరిత 2005లో అనారోగ్యంతో చనిపోయింది. 2011లో జరిగిన ప్రమాదంలో 9 ఏళ్ల కొడుకును కోల్పోయాను. గోడ్నా లేకుండా ఎలా బతకాలో తెలియడం లేదు’ అని వాపోయాడు. కరపత్రాలు పంచుతున్నానని, తిరిగిన ప్రతి చోట, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్ల వద్ద చాయ్వాలాలు, దుకాణదారుల నంబర్లు తీసుకున్నానని చెబుతున్నాడు. తన కొడుకు కోసం వేయి కళ్లతో వెతుకుతూనే ఉంటానని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు. -
చిన్నారుల కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి ఫైర్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది – లభించని ఆచూకీ కర్నూలు (రాజ్‌విహార్): కేసీ కెనాల్లో తప్పిపోయిన చిన్నారుల కోసం వివిధ శాఖల అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని సప్తగిరి నగర్లో నివాసముంటున్న మోనేశాచారి, పద్మవతి దంపతుల కవల పిల్లలు ఆదివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. పన్నెండేళ్ల చిన్నారులు ప్రకాష్, మురళి మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా కేసీ కెనాల్లో ఈతకు వెళ్లి అదృశ్యం కాగా సోమవారం మధ్యాహ్నం వినాయక్ ఘాట్ వెనుక కేసీ కెనాల్ ఒడ్డున పిల్లలకు సంబంధించిన దుస్తులు కన్పించడంతో వెలుగులోకి వచ్చింది. వాటిని గుర్తించిన తల్లిదండ్రులు పిల్లలు కేసీ కెనాల్లో కొట్టుకుపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమివ్వడంతో దుస్తులను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే మంగళవారం కర్నూలు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం. భూపాల్‌రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిరణ్‌కుమారెడ్డి ఆధ్వర్యంలో రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు కర్నూలు వినాయక ఘాట్ నుంచి జూపాడుబంగ్లా వరకు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సిబ్బంది ఉధృతంగా ప్రవహిస్తున్న కేసీ కెనాల్లో లైఫ్ జాకెట్లు, తాళ్ల సాయంతో వెతికారు. వీరికి పోలీసు, రెవెన్యూ సిబ్బందిలోపాటు నీటి పారుదల శాఖ లస్కర్లు సహకారం అందించారు. రోజంతా గాలించినప్పటికీ చిన్నారుల ఆచూకీ లభించలేదని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కూడా గాలింపు చర్యలు చేపడతామని వెల్లడించారు. -
కొనసాగుతున్న పడవ వెలికితీత పనులు
నిడదవోలు : విజ్జేశ్వరం వద్ద గోదావరి స్కవర్‡ స్లూయిజ్ గేటులో చిక్కుకుపోయిన పాత ఇనుప పడవ వెలికితీసేందుకు ఆదివారం కూడా శ్రమించారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఏటా గోదావరి వరదల సమయంలో పేరుకుపోయిన మట్టి, పూడికను తొలగించేందుకు ధవళేశ్వరం హెడ్ వర్క్స్ అధికారులు ఈ నెల 4న స్కవర్ ఆపరేషన్‌లో భాగంగా స్కవర్ స్లూయిజ్ నాలుగు గేట్లను ఎత్తారు. ఈ సమయంలో గోదావరిలో నీరు సముద్రం వైపునకు వదులుతారు. ఆ ప్రవాహనికి బ్యారేజీ వెనుక వైపు మట్టిలో కూరుకుపోయిన పాత ఇనుప పడవ ఒకటి కొట్టుకొచ్చి ఒక గేటులో చిక్కుకుపోయింది. ఇనుప పడవ కావడంతో గేటుకు కొక్కానికి పడవ పట్టేసింది. దీంతో ఎంత నీటి ప్రవాహం ఉన్నా అది కొట్టుకురాకుండా ఉండిపోయింది. దీంతో దానిని తీయడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఎస్ఈ బి.రాంబాబు, ఈఈ ఎన్.కృష్ణారావులు దగ్గరుండి పడవ తీసే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా స్టాప్‌లాగ్ గేట్లును మూసివేసి నీటి ప్రవాహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్టాప్‌లాగ్ గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి తుప్పుపట్టి కిందకు దిగడం లేదు. స్టాప్‌లాగ్ గేట్లను కిందకు దించితే తప్ప నీటి ప్రవాహం అడ్డుకట్ట వేయలేరు. పడవ తీసేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
జిల్లా కోర్టులోతనిఖీలు
ఒంగోలు సెంట్రల్ : జిల్లా కోర్టులో శనివారం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. జిల్లా కోర్టు ప్రాంగణం మొత్తం కలియతిరిగాయి. నెల్లూరు కోర్టులో గతంలో ఉగ్రవాదులు బాంబులు అమర్చిన నేపథ్యంతో పాటు మావోయిస్టుల ఎన్కౌంటర్ జరగడంతో బాంబు, డాగ్ స్క్వాడ్లకు ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు ప్రాంగణంలో పాడైన వాహనాలు తీసేస్తే బాంబులు అమర్చేందుకు అవకాశం ఉండదని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
నయీమ్ యాక్షన్ టీమ్ ఎక్కడ..?
నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత కనిపించని ఏడుగురి జాడ ► ఈ కరడుగట్టిన నేరగాళ్లతోనే ‘కీలక ఆపరేషన్లు’ ► ముమ్మరంగా గాలిస్తున్న రాష్ట్ర పోలీసు వర్గాలు ► ఇప్పటి వరకు చిక్కిన వారంతా సివిల్ వ్యవహారాల్లో క్రిమినల్సే సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అతడి అనుచరుల్ని పోలీసులు పట్టుకుంటున్నారు. అయితే వీరందరినీ మించిన ‘యాక్షన్’ టీమ్ ఒకటి ఉందని రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఏడుగురి కోసం రాష్ట్ర పోలీసు విభాగం ముమ్మరంగా గాలిస్తోంది. నయీమ్‌తోపాటు అతడి సామ్రాజ్యాన్ని కూడా కుప్పకూల్చాలనే ఉద్దేశంతో పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు నయీమ్‌తో సంబంధమున్న 20 మందిని పైగా అరెస్టు చేశారు. అయితే వీరంతా ఇప్పటి వరకు వెలుగులోకి రాని సివిల్ నేరగాళ్లని, తెరచాటుగా ఉంటూ నయీమ్ ఆదేశాల మేరకు పని చేస్తూ వచ్చారని అధికారులు పేర్కొంటున్నారు. భూ కబ్జాలకు పాల్పడటం, బెదిరింపుల ద్వారా వసూళ్లు చేయడం, ల్యాండ్ సెటిల్మెంట్స్లో కీలకపాత్ర పోషించడంతోపాటు నయీమ్ ఆస్తులకు బినామీలుగా, ఆస్తి పత్రాలు, నగదు, ఆయుధాలు దాచే డెన్స్‌కు కేర్ టేకర్స్‌గా పని చేశారు. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీమ్ కనుసన్నల్లో పని చేసింది. వీరి పేర్లు, వ్యవహారాలు గతంలో చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నేరగాళ్లు, మాజీ మావోయిస్టులు తదితరులతో కూడిన ఈ టీమ్ నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో యాక్టివ్‌గా పని చేసింది. అనేక కేసుల్లో వీరి ప్రస్తావన ఉంది. నయీమ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగడం.. హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడి ఆపై షెల్టర్ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని. వీరికి బదులుగా ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీమ్ సిద్ధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో యాక్షన్ టీమ్‌కు చెందిన వారి పేర్లు కేవలం కుట్రదారులుగానే ఉంటాయి. ఇంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్ టీమ్ ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిని కూడా అణచివేయకుంటే నయీమ్ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేయవచ్చని స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర పోలీసు ప్రత్యేక బృందాలు ఈ యాక్షన్ టీమ్ సభ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ ఏడుగురూ అత్యంత కీలకం.. నయీమ్ యాక్షన్ టీమ్‌లో ఏడుగురు వ్యక్తులు అత్యంత కీలకమని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన, హైదరాబాద్‌లో జరిగిన పటోళ్ల గోవవర్దన్రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్న.. యాక్షన్ టీమ్‌లో అత్యంత కీలకం. ఇతడితో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన చెన్నారం రాజు, అచ్చంపేటకు చెందిన జహంగీర్, సిద్దిపేటకు చెందిన మల్కపురం మహేశ్ (పటోళ్ల గోవర్దన్‌రెడ్డి హత్యకు స్కెచ్ ఇతడే వేసినట్లు ఆరోపణలున్నాయి), మహబూబ్‌నగర్‌కు చెందిన దామోదర్‌రెడ్డి (ఇతడి సోదరుడు వెంకట్‌రెడ్డిని పటోళ్ల గోవర్దన్‌రెడ్డి హత్య చేశాడు) హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌కు చెందిన ఆసిఫ్, పాతబస్తీకి చెందిన ఫెరోజ్.. యాక్షన్ టీమ్‌లోని ప్రధాన సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఏడుగురితోపాటు వీరి నీడలో పని చేసిన, చేస్తున్న కిరాయి మనుషుల జాడ కూడా గుర్తించేందుకు రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. -
నయీం బెడ్ రూంలో సిట్ సోదాలు
-
గల్లంతైన విమానం కోసం మన్యంలో గాలింపు
రాజవొమ్మంగి : గల్లంతైన వాయుసేన విమానం కోసం అధికారుల బృందం రెండో రోజు మంగళవారం కూడా ఏజñ న్సీ పరిధిలోని రాజవొమ్మంగి పరిసరాల్లో ఆరాతీశారు. ఇందుకోసం రెండు బుగ్గ కార్లలో అధికారుల బృందం ఇక్కడకు వచ్చారు. మరోవైపు ఆకాశంలో రెండు హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల పరిధిలో కనిపించాయి. గల్లంతైన విమానం కోసం కొంతమంది ఎయిర్‌ఫోర్స్ అధికారులు, విమానంలోని సిబ్బంది బంధువులు ఈ రెండు మండలాల్లో తిరిగి ఇటువైపు ఏదైనా విమానం Ðð ళ్లిందా? అంటూ స్థానికులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం వచ్చిన అధికారులు జడ్డంగి, రాజవొమ్మంగి పోలీస్‌స్టేçÙన్లు, రాజవొమ్మంగి అటవీక్షేత్ర కార్యాలయాల్లో స్థానిక అధికారుల సహాయాన్ని కోరారు. స్థానిక అటవీక్షేత్రాధికారి ఎం. శివకుమార్ వద్దకు వచ్చిన బాపట్ల సమీపంలోని సూర్యలంక ఎయిర్‌బేస్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ రావ్ ఈ ప్రాంతంలో ఎక్కడైనా పెద్ద శబ్ధం వచ్చిందా? అంటూ ఆరాతీశారు. ఈ ప్రాంతంలో విమానం కిందికంటూ ఎగురుతూ కనిపించినట్టు తమకు సందేశాలు అందాయని ఎయిర్‌ఫోర్స్ అధికారులు శివకుమార్‌తో అన్నారు. ఆ అధికారులు రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డి, పూదేడు తదితర నాగులకొండ పరీవాహక లోతట్టు గ్రామాల్లో కూడా విచారించారు. ఒక విమానం కిందికంటూ ఎగురూతూ వెళ్లడాన్ని నేను చూశానంటే.. నేను చూశానంటూ ఈ ప్రాంతంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. -
వేటగాళ్ల కోసం ముమ్మరంగా గాలింపు
వెల్దుర్తి: జింకలను వేటాడి అతి క్రూరంగా చంపిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నామని డీఎఫ్ఓ శ్రీధర్‌రావు తెలిపారు. శనివారం మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో పలువురిని విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22న ఉదయం ఆటోలో వేటగాళ్లు జింకలను చంపి తీసుకెళ్తుండగా శెట్టిపల్లి వద్ద వీఎస్ఎస్ బాలయ్య గమనించి పట్టుకున్నాడని తెలిపారు. విషయం మా దృష్టికి తేగా తమ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి అడవిలోనే ఖననం చేశారన్నారు. ఒక మగ జింక, ఆడ జింకలకు పొట్టలు, గొంతులు కోశారని , రెండు పిల్ల జింకలకు సైతం గొంతులు కోశారని తెలిపారు. అనుమానితులైన ఇద్దరు తమ అదుపులో ఉన్నారని, జింకలను సరఫరా చేసే ఆటోను సీజ్ చేశామన్నారు. ఇదిలా ఉండగా గ్రామస్తులతోపాటు బాలయ్య మాట్లాడుతూ హైదరాబాద్ నుండి పిస్తోల్ కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రతి శనివారం సాయంత్రం సమయంలో శెట్టిపల్లి అడవిలోకి వచ్చి జంతువులను వేటాడుతుంటాడని డీఎఫ్‌ఓకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణ చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది అడవి జంతువులు వివిధ రకాల పంటలను ధ్వంసం చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 10.50 లక్షలను రైతులకు పంట నష్ట పరిహారంగా అందచేశామన్నారు. పంటలు ధ్వంసమైతే 24 గంటలలోపు రైతులు తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎకరాకు పంటను బట్టి రూ. 6 నుండి రూ. 10వేల వరకు నష్ట పరిహారం అందజేస్తామన్నారు. ఆయన వెంట వైల్డ్‌లైఫ్ పోచారం అభయారణ్యం రేంజ్ అధికారి భర్నోబా, సిబ్బంది ఉన్నారు. -
వేందర్ మూవీస్ మదన్ అదృశ్యం
భార్య, స్నేహితుల గాలింపు మధురై: వేందర్ మూవీస్ మదన్ గంగలో సమాధి అవుతానని లేఖ రాసి పెట్టి అదృశ్యం అయిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. దీంతో ఆయనను వెదుక్కుంటూ భార్య, మిత్రులు కాశీకి బయల్దేరారు. వేందర్ మూవీస్ సంస్థాపకుడు మదన్. ఈయన 2011లో ఈ సంస్థను ప్రారంభించి ‘అరవాన్’, విశాల్ నటించిన పాండియనాడులతో సహా పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 20 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఈయన ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధ్యక్షుడు పచ్చముత్తుకు సన్నిహితుడు. వేందర్ అని పిలవబడే పచ్చముత్తు తరఫున వేందర్ మూవీస్ అనే సంస్థను ప్రారంభించారు. అంతేకాకుండా ఎస్ఆర్ఎం కళాశాలలో అడ్మిషన్ల భర్తీకి మదన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. విద్యార్థులు చెల్లించే డొనేషన్ మదన్ ద్వారా కళాశాలకు చేరుతుంది. ఈ స్థితిలో వేందర్ మూవీస్ లెటర్ హెడ్లో ఐదుపేజీల లేఖను రాసిపెట్టి మదన్ అదృశ్యం అయ్యారు. ఈ లేఖ జిరాక్స్‌ను వాట్సప్ ద్వారా సినిమా, పత్రికల్లోని స్నేహితులకు పంపారు. అంతేగాకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఆ లేఖలో తాను కాశీలోని గంగలో సమాధి అవుతానని తెలిపారు. తాను ఎంతో నిజాయితీగా, నిస్వార్థంగా పచ్చముత్తు వద్ద పనిచేశానని, కొందరు తనపై చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య వున్న స్నేహాన్ని దెబ్బతీశారని, ఐజేకే పార్టీ అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడినట్లు మదన్ తెలిపారు. ఈ స్థితిలో విరక్తి చెందిన తాను ఇకపై ప్రాణాలతో బతికి ఉండడం వృథా అని పేర్కొన్నారు. దీంతో అతను ఎక్కిడికి వెళ్లాడనే ఆచూకీ తెలియలేదు. మదన్‌ను వెతుకుతూ అతని భార్య, అమ్మ క్రియేషన్స్ శివ, నటుడు లారెన్స్ కాశీకి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. -
భారత్‌లో సిరియన్ల కోసం వేట
న్యూఢిల్లీ: సిరియా నుంచి భారత్‌కు వచ్చిన సిరియా దేశస్థుల్లో వందమంది వీసా గడువు ముగిసి పోయినప్పటికీ వారి దేశం తిరిగి వెళ్లకుండా దేశంలోనే తప్పించుకు తిరుగుతున్నారు. వారిలో ఎక్కువ మంది యువకులే ఉండడం, వారికి ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉండే అవకాశం ఉండడంతో భారత భద్రతా దళాలు వారిని వెతికి పట్టుకునేందుకు వేట సాగిస్తున్నాయి. వారిలో కొంతమంది యువకులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో వారి ఆచూకి కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశామని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఉన్నత ప్రభుత్వాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. వారిలో ఎక్కువ మంది వైద్య చికిత్స నిమిత్తం, పర్యాటక కోసం రాగా, కొంత మంది 15 రోజుల ట్రాన్సిట్ వీసాలపై వచ్చారని ఆయన తెలిపారు. వైద్యం, పర్యాటక కోసం వచ్చేవారికి రెండు వారాల నుంచి ఆరు నెలలపాటు భారత్‌లో ఉండేందుకు వీసాలు జారీ అయ్యాయని, గతేడాది భారత్‌కు వచ్చి తిరిగి వెళ్లని వారు వందమంది ఉన్నారని, అలాంటి వారి జాబితాను రూపొందించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించామని ఆ అధికారి వివరించారు. వారిలో కొంత మంది పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. కొంతమంది సిరియన్లు భారత్‌కు వచ్చారని, వారు ఐక్యరాజ్య సమతి మార్గదర్శకాల ప్రకారం భారత ప్రభుత్వాన్ని శరణుకోరుతున్నారని, వారిలో కొంతమందికి టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు కూడా ఉన్నాయని భారత్‌లోని సిరియా అంబాసిడర్ రియాద్ కామెల్ అబ్బాస్ స్వయంగా ఇటీవల ప్రకటించడం ఇక్కడ గమనార్హం. -
ప్రేమ జంట కోసం గోదావరిలో కొనసాగుతున్న గాలింపు
రాజోలు : పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో గోదావరిలో దూకి గల్లంతైన ప్రేమజంట ఆచూకీ లభించలేదు. బుధవారం బంధువులు, స్నేహితులు చించినాడ వద్ద గోదావరి వశిష్ట పారుు తీరంలో గాలింపు చర్యలు చేపట్టారు. దిండి, రామరాజులంక, టేకిశెట్టిపాలెం, అప్పనరామునిలంక, సఖినేటిపల్లి, నరసాపురం గోదావరి ప్రాంతాల్లో గాలించారు. వారి ఆచూకీ లభించకపోవడంతో శివకోడులో విషాదఛాయలు నెలకొన్నాయి. శివకోడుకు చెందిన కడలి నరేష్(20), గుబ్బల సాయికుమారి(20) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన సాయికుమారిని పెళ్లి చేసుకుంటానని నరేష్ చెప్పడంతో పెద్దలు అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన నరేష్, సాయికుమారి చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకారు. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోదావరిలో రెండు పడవలతో మత్స్యకారులు గాలిస్తుండగా, గోదావరి తీరంలో బంధువులు, స్నేహితులు గాలింపు కొనసాగిస్తున్నారు. -
హుస్సేన్‌సాగర్‌లో వ్యక్తి కోసం గాలింపు
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. బోటులోంచి ఓ వ్యక్తి ఆదివారం సాయంత్రం సాగర్ నీళ్లల్లో పడిపోయాడు. అయితే, సందర్శకుల బోటు నుంచి ఓ వ్యక్తి నీళ్లలోకి దూకేశాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఖైరున్నీసా బోటులో 100 మంది సందర్శకులు సాగర్‌లో విహరిస్తున్నారు. బుద్ధ విగ్రహం వద్ద ఉన్న ఓ యువతి.. బోటులోంచి ఓ వ్యక్తి నీటిలోకి దూకినట్టు చూశానని చెప్పడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడా.. లేక ప్రమాదవశాత్తూ నీళ్లల్లో పడిపోయాడా తెలియాల్సి ఉంది. బాధితుడి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
తృటిలో తప్పించుకున్న మావోయిస్టులు
వరంగల్: వరంగల్ జిల్లా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి. గురువారం అర్థరాత్రి అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అప్రమత్తమన మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే ...పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల్లో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలు ఇన్నోవాను అటకాయించారు. దీంతో వాహనాన్ని వదిలేసిన మావోయిస్టులు, అక్కడినుంచి తప్పించుకుని పారిపోయారు. ఏటూరు నాగారం వైపు వారు పారిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఆచూకీ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. -
మత్స్యకారుల కోసం హెలికాప్టర్లతో అన్వేషణ
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. శనివారం కాకినాడ బీచ్ రోడ్డులో బాధిత మత్స్యకార కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గల్లంతైన వారి కోసం రిలయన్స్ హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నామని, సముద్రంలో వారు ఎక్కడ చిక్కుకున్నా గుర్తించి కాపాడతామన్నారు. కాకినాడ దుమ్ములపేటకు చెందిన బోటులో ఆరుగురు మత్స్యకారులు ఈ నెల 17న సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. కాగా దుమ్ములపేట, పర్లోపేటకు చెందిన మరో 20 బోట్ల సమాచారం కూడా తెలియరావడం లేదని మత్స్యకారులు పేర్కొంటున్న నేపథ్యంలో... కోస్ట్‌గార్డ్, రిలయన్స్ హెలికాప్టర్ల ఆధ్వర్యంలో వారి కోసం శనివారం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
సురభి గార్డెన్స్‌లో అటవీశాఖ అధికారుల సోదాలు
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సురభి గార్డెన్స్‌లో అటవీశాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. చట్ట విరుద్ధంగా జాతీయ పక్షి నెమలి సహా పలు వన్యప్రాణులను పెంచుతున్నట్లు పక్కా సమాచారం అందటంతో పోలీసుల సాయంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూ ఆక్రమణలు సహా పలు అక్రమాలకు సురభి గార్డెన్స్ యాజమాన్యం పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా బుధవారం రాత్రే సురభి గార్డెన్స్‌లో కంటోన్మెంట్ అధికారులు సీజ్ చేశారు. అలాగే వైల్డ్‌లైఫ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ సచివాలయంలో సీఎస్ తనిఖీలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఏపీ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలోని వివిధ బ్లాకులను ఆయన పరిశీలించారు. ఉద్యోగులు రాకపోకలు, సౌకర్యాలపై కృష్ణారావు ఆరా తీశారు. పారిశుధ్యానికి పెద్ద పీట వేయాలని.. అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గతంలోనూ ఐవైఆర్ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. -
'నాకు బతకాలని లేదు'
అదిలాబాద్(దహెగావ్): నాకు బతకాలని లేదని కుటుంబ సభ్యులకు చెప్పి వాగులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దహెగావ్ మండలం అయినం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెల్మల సంతోష్(23) సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్న సంతోష్ సోమవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాకు బతకాలని లేదని చనిపోవాలనిపిస్తోందని చెప్పాడు. కాసేపటి తర్వాత బావి వద్ద చూసుకోండి ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టెశాడు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే బావి వద్దకు వచ్చి చూడగా బావికి దగ్గర్లో ఉన్న వాగు గట్టు వద్ద సెల్ ఫోన్‌తో పాటు సంతోష్ బట్టలు, చెప్పులు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సంతోష్‌కు భార్య సునీతతో పాటు కుమారుడు కార్తీక్(3), కుమార్తె కావేరి (నాలుగు నెలల పాప) ఉన్నారు. -
నిర్జీవంగా అనుదీప్
ఒంగోలు క్రైం: నగరంలోని ఎస్ఎస్ ట్యాంకు-2లో రెండు రోజుల క్రితం జారి పడిన విద్యార్థి శనివారం ఉదయం శవమై నిర్జీవంగా కనిపించాడు. నగరానికి చెందిన పిన్నిక సాయి అనుదీప్ అనే పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ ట్యాంకులో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అనుదీప్ తన స్నేహితులతో కలిసి ఆ పక్కనే క్రికెట్ ఆడుకొని ట్యాంకు వద్దకు వెళ్లి అందులో ప్రమాదవశాత్తూ పడ్డాడు. తాలూకా సీఐ ఎస్.ఆంథోనిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరకు మృతదేహమై బయటకు వచ్చాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. -
'విమానాశ్రయంపై దాడి చేస్తాం'
ముంబై : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దాడులకు తెగబడతామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మరోసారి హెచ్చరించింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంపై దాడి చేస్తామని ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ముంబయి ఎయిర్‌పోర్టులోని స్నానాల గదిలో ఈ లేఖలు కనిపించాయి. రిపబ్లిక్ డే రోజు దాడులు చేస్తామని ఐఎస్ఎస్ లేఖల్లో ఆ సంస్థ పేర్కొంది. దాంతో అప్రమత్తమైన విమానాశ్రయంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు ఈ సమాచారంపై కేంద్ర హోంశాఖ ...పోలీసు శాఖను ఎలర్ట్ చేసింది. ఈ నెల 10న దాడి చేస్తామని ...ఇదే తరహాలో ఏడో తేదీన వాష్ రూమ్ లో రాతలు కనిపించిన విషయం తెలిసిందే. -
కరీంనగర్లో బాంబు కలకలం
కరీంనగర్ : కరీంనగర్లో సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. పట్టణంలోని విద్యాధరి స్కూల్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు ...సోమవారం ఉదయం స్కూలుకు ఫోన్ చేశారు. దాంతో పాఠశాల యాజమాన్యం....పోలీసులకు సమాచారం అందించి...విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపించారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ బృందం అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని సమాచారంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఆకతాయిల పనిగా గుర్తించిన పోలీసులు ఫోన్‌కాల్‌పై ఆరా తీస్తున్నారు. -
తవ్వకాల కలకలం
సాక్షి, గుంటూరు: పల్నాడులో పురాతన దేవాలయాల వద్ద గుప్త నిధుల తవ్వకాల విషయం కలకలం రేపుతుంది. దీనిలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు పోలీసు అధికారులపై ఆ శాఖలో తీవ్ర చర్చ జరుగుతుంది.‘గుప్త నిధుల వేట’ శీర్షికన ఈ నెల నాలుగవ తేదీన ‘సాక్షి’ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. గుంటూరుతో పాటు శ్రీశైలం నుంచి వచ్చిన ముఠాలు రాత్రిళ్లు పూజలు చేస్తూ తవ్వకాలు చేస్తున్నారనే విషయాన్ని రూరల్ జిల్లా ఎస్పీ జె. సత్యనారాయణ సీరియస్‌గా పరిగణించారు. ఇప్పటికే తవ్వకాలపై ఆరా తీయడంతో పాటు పోలీసు అధికారులపై వినిపిస్తున్న ఆరోపణల్లోని వాస్తవాల్ని నిగ్గుతేల్చాలని స్పెషల్‌బ్రాంచి సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ప్రధానంగా బెల్లంకొండ మండలంలో వేమవరం, కేతవరం, పడవలరేవు, కోళ్లూరు గ్రామాల్లో చాలాచోట్ల తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. పాతకాలపు శిలా శాసనాలు ఉన్న దేవాలయాల వద్ద గ్రామస్తులు బృందాలుగా ఏర్పడి వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గుప్తనిధులు తవ్వేసి పంచుకుందామని ప్రయత్నించిన ముగ్గురు ‘ఖాకీ’ లు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. తవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని పిడుగురాళ్ల సమీపాన వున్న ఓ క్వారీలో దాచిపెట్టి ఏమీ తెలియనట్లు మసలుతున్నారని తెలిసింది. గతంలో ఈ ముగ్గురు కలిసి అదే మండలంలో తవ్వకాలు జరిపిన ప్పుడు గుప్తనిధి బదులు మావోయిస్టులు దాచిన డంప్ దొరికిందని, తవ్వకాల కలకలం వాటిల్లో భారీగా డబ్బు కూడా ఉన్నట్లు సమాచారం. తవ్వ కాలకు ఖర్చు పెట్టిన గుంటూరున్యాయవాది సొమ్ముకు ఆ ముగ్గురు అధికారులు హామీనిచ్చినట్లు తెలిసింది. దొంగస్వాముల బురిడీ.. తాజాగా పోలీసులు చేపట్టిన విచారణలో పలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణానదీ తీర గ్రామా ల్లో గుప్త నిధులు వున్నాయని, వజ్రాలు దొరుకుతున్నాయని, విలువైన రంగురాళ్లు సేకరిస్తున్నామని కొందరు మోసగాళ్లు స్వామీజీల అవతార మెత్తుతున్నారు. వీరు ఓ బృందంగా ఏర్పడి ధనవంతులను వల లో వేసుకుంటున్నారు. శ్రీశైలం నుంచి ఇద్దరు వ్యక్తులతో పాటు దాచేపల్లిలో ఉండే ఓ వ్యక్తి స్వామిజీలుగా చెప్పుకుంటూ డబ్బు దండుకుంటున్నారు. వీరిలో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. బోధనం గ్రామానికి చెందిన ఓ మహిళకు వారం కిందట ఓ రంగురాయి దొరికింది. దాన్ని వజ్రంగా భ్రమించి, దాన్ని విక్రయించాలని భారీగా ఖర్చు పెట్టినట్లు తెలిసింది. చివరకు, అది రంగురాయి కూడా కాదని తేలడంతో మిన్నుకున్నట్లు సమాచారం.