గల్లంతైన విమానం కోసం మన్యంలో గాలింపు
గల్లంతైన విమానం కోసం మన్యంలో గాలింపు
Published Wed, Jul 27 2016 12:53 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
రాజవొమ్మంగి : గల్లంతైన వాయుసేన విమానం కోసం అధికారుల బృందం రెండో రోజు మంగళవారం కూడా ఏజñ న్సీ పరిధిలోని రాజవొమ్మంగి పరిసరాల్లో ఆరాతీశారు. ఇందుకోసం రెండు బుగ్గ కార్లలో అధికారుల బృందం ఇక్కడకు వచ్చారు. మరోవైపు ఆకాశంలో రెండు హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల పరిధిలో కనిపించాయి. గల్లంతైన విమానం కోసం కొంతమంది ఎయిర్‌ఫోర్స్ అధికారులు, విమానంలోని సిబ్బంది బంధువులు ఈ రెండు మండలాల్లో తిరిగి ఇటువైపు ఏదైనా విమానం Ðð ళ్లిందా? అంటూ స్థానికులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం వచ్చిన అధికారులు జడ్డంగి, రాజవొమ్మంగి పోలీస్‌స్టేçÙన్లు, రాజవొమ్మంగి అటవీక్షేత్ర కార్యాలయాల్లో స్థానిక అధికారుల సహాయాన్ని కోరారు. స్థానిక అటవీక్షేత్రాధికారి ఎం. శివకుమార్ వద్దకు వచ్చిన బాపట్ల సమీపంలోని సూర్యలంక ఎయిర్‌బేస్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ రావ్ ఈ ప్రాంతంలో ఎక్కడైనా పెద్ద శబ్ధం వచ్చిందా? అంటూ ఆరాతీశారు. ఈ ప్రాంతంలో విమానం కిందికంటూ ఎగురుతూ కనిపించినట్టు తమకు సందేశాలు అందాయని ఎయిర్‌ఫోర్స్ అధికారులు శివకుమార్‌తో అన్నారు. ఆ అధికారులు రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డి, పూదేడు తదితర నాగులకొండ పరీవాహక లోతట్టు గ్రామాల్లో కూడా విచారించారు. ఒక విమానం కిందికంటూ ఎగురూతూ వెళ్లడాన్ని నేను చూశానంటే.. నేను చూశానంటూ ఈ ప్రాంతంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Advertisement