సాక్షి, హైదరాబాద్: అందుబాటు ధర, అభివృద్ధి చెందిన ప్రాంతం, అన్ని రకాల వసతులుంటే గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో కొనుగోలుదారులు తెగ వెతికేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ కాస్త నెమ్మదించడంతో జూన్ నెలలో ఆన్‌లైన్‌లో సెర్చింగ్ విపరీతంగా పెరిగిందని రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ తెలిపింది. అంతకుముందు వరుసగా రెండు నెలలు క్షీణించాయని పేర్కొంది.
ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుంచి వాస్తవ డిమాండ్ సాధ్యమవుతుందని తెలిపింది. జూన్‌లో అత్యధికంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్ నగరంలో ప్రాపర్టీల కోసం ఆన్‌లైన్‌లో శోధనలు జరిగాయని గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. రెండో స్థానంలో ముంబై, ఆ తర్వాత వరుసగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లూథియానా, పుణే, గోవా, సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా, గౌహతి, వారణాసి, అమృత్‌సర్, కోయంబత్తూర్, పాటా్న, మీరట్, జైపూర్, కాన్పూర్, లక్నో ప్రాంతాలలోని గృహాల కోసం ఆన్‌లైన్‌లో వెతికారని రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో ఆన్‌లైన్ సెర్చింగ్ క్షీణించగా.. జూన్‌లో 9 పాయింట్లు పెరిగిందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment