నగరంలోని ఎస్‌ఎస్ ట్యాంకు-2లో రెండు రోజుల క్రితం జారి పడిన విద్యార్థి శనివారం ఉదయం శవమై నిర్జీవంగా కనిపించాడు.
ఒంగోలు క్రైం: నగరంలోని ఎస్‌ఎస్ ట్యాంకు-2లో రెండు రోజుల క్రితం జారి పడిన విద్యార్థి శనివారం ఉదయం శవమై నిర్జీవంగా కనిపించాడు. నగరానికి చెందిన పిన్నిక సాయి అనుదీప్ అనే పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ ట్యాంకులో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అనుదీప్ తన స్నేహితులతో కలిసి ఆ పక్కనే క్రికెట్ ఆడుకొని ట్యాంకు వద్దకు వెళ్లి అందులో ప్రమాదవశాత్తూ పడ్డాడు.
తాలూకా సీఐ ఎస్.ఆంథోనిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరకు మృతదేహమై బయటకు వచ్చాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.