కరీంనగర్ : కరీంనగర్లో సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. పట్టణంలోని విద్యాధరి స్కూల్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు ...సోమవారం ఉదయం స్కూలుకు ఫోన్ చేశారు. దాంతో పాఠశాల యాజమాన్యం....పోలీసులకు సమాచారం అందించి...విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపించారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ బృందం అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని సమాచారంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఆకతాయిల పనిగా గుర్తించిన పోలీసులు ఫోన్కాల్పై ఆరా తీస్తున్నారు.