Bomb Scare
-
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు
ఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇజ్రాయెల్ ఎంబస్సీపై బాంబులు వేస్తామంటూ పోలీసులకు దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు గుర్తు తెలియని వ్యక్తి అగ్ని మాపకశాఖ పోలీసులకు ఫోన్ చేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్‌లో పేలుడు సంభవించనుందని పేర్కొన్నాడు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసు ప్రత్యేక సెల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. అధికారులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేయడంతో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఫోన్ కాల్‌పై సమగ్ర విచారణ జరుగుతోంది. ఢిల్లీలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఉంది. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు
-
అంబానీ బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం
ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో నిండిన వాహనం లభించిన కేసుతో పాటు వాణిజ్యవేత్త మన్సుఖ్ హిరాన్ హత్య కేసులో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)అభియోగాలను నమోదు చేసింది. మాజీ పోలీసు అధికారులు సచిన్ వాజే, ప్రదీప్ శర్మ, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదు చేసిన పత్రాలను ప్రత్యేక కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జీషీటులో సచిన్ వేజ్, ప్రదీప్ శర్మ, వినాయక్ షిండే, నరేష్ గోర్, రియాజుద్దీన్ కాజీ, సునీల్ మానె, ఆనంద్ జాదవ్, సతీశ్ మోతుకూరి, మనీష్ సోని, సంతోష్ షెలార్ పేర్లు ఉన్నాయి. మరో కేసులో కూడా నిందితుడైన వినాయక్ షిండే పోలీసు శాఖ నుంచి సస్పెండ్ కాగా, కాజీ, మానెలను అరెస్ట్ చేసినప్పుడు వారు పోలీసు శాఖలోనే విధులు నిర్వహిస్తున్నారు. అరెస్టయిన వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. -
అంబానీ ఇంటి వద్ద కారుబాంబు.. ‘ఏదో తేడా కొడుతోంది’
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన కారుబాంబు కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. దీంతో ఎన్ఐఏ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం స్పందించారు. రాష్ట్ర పోలీసు శాఖ విచారించగల కేసును ఎన్ఐఏకు అప్పగించడం చూస్తే ఏదో తేడా కొడుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ అధికారులు ఎల్లప్పుడూ ఉంటారని ఎన్ఐఏను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఆటో పార్ట్స్ డీలర్ మన్సుఖ్ హిరాన్ మరణోదంతాన్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అప్పగించామని, ఈ నేపథ్యంలో ఎన్ఐఏకు కేసు వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. హిరాన్ మరణంపై ఏటీఎస్ ఆదివారమే కేసు నమోదు చేసిందని, దానిపై ఏటీఎస్ విచారణ కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర యంత్రాంగం ఈ కేసును విచారించగలదని ప్రతిపక్ష బీజేపీ విశ్వసించడం లేదని, అది పనిచేయడం లేదని చూపించాలని అనుకుంటోందని విమర్శించారు. ఒకవేళ వారు అలా భావిస్తే ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వమే పన్నులను తగ్గించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏడు సార్లు ఎంపీగా గెలుపొందిన మోహన్ దేల్‌కరంద్ ఆత్మహత్య చేసుకోవడంపై కూడా రాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నారని, అన్ని వివరాలను బయటపెడతామని అన్నారు. అన్నిసార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి మరణంపై బీజేపీ ఎందుకు వ్యూహాత్మక మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి -
విమానం పేలుస్తానని మహిళ బెదిరింపు
కోల్‌కతా: బాంబులతో విమానాన్ని పేలుస్తానని ఓ ప్రయాణికురాలు బెదిరించడంతో ముంబైకి వెళ్తున్న విమానం వెనుదిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. 114 మంది ప్రయాణికులతో ఉన్న ఎయి ర్ ఏషియా విమానం శనివారం రాత్రి 9.57 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికే అందులోని ఓ ప్రయాణికురాలు విమాన సిబ్బ ందికి ఓ నోట్‌ను అందించింది. తన వద్ద బాం బులున్నాయని, వాటిని పేల్చేస్తానని అందులో ఉంది. పైలట్ వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కి చేరవేశారు. ఏటీ సీ ఆదేశాల మేరకు విమానాన్ని తిరిగి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చాడు. ఆమె వద్ద కానీ, విమానంలో కానీ ఎక్కడా బాంబులు లేవని సోదాల అనంతరం భద్రతాధికారులు నిర్ధారించారు. ఆ ప్రయాణికురాలు మత్తులో ఉన్నట్లు తేలిందని తెలిపారు. -
అవ్వ చేసిన పొరపాటు.. ఎయిర్‌పోర్టు హడల్
బ్రిస్బేన్ : ముంబైకి చెందిన ఓ బామ్మ చేసిన పొరపాటు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన వెంకట లక్ష్మి అనే బామ్మ తన పుట్టిన రోజు వేడుకల కోసం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లింది. వెళ్తూ ఓ బ్యాగ్‌లో తన లగేజీని తీసుకెళ్లింది. అసలు సమస్య అక్కడే ప్రారంభం అయ్యింది. ఎయిర్‌పోర్టులో దిగంగానే బామ్మ లగేజ్‌పై ఉన్న విషయాన్ని చూసిన అధికారులు హడలి పోయారు. అంతే కాకుండా లగేజీ మొత్తం తనిఖీ చేశారు. కానీ ఏమీ బయట పడలేదు. కానీ అసలు విషయం ఏంటంటే.. బామ్మ తను తీసుకెళ్లే బ్యాగ్‌పై బాంబే టూ బ్రిస్బేన్ బదులు 'బాంబ్ టూ బ్రిస్బేన్' అని రాసుకుంది. అది చూసిన అధికారులు బ్యాగ్‌లో బాంబ్ ఉందేమోనన్న అనుమానంతో ఎయిర్‌పోర్టు మొత్తం అలెర్ట్ చేశారు. అనంతరం బామ్మను ప్రత్యేక గదిలో విచారించగా అసలు విషయం ఏంటో తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్‌పై తగిన ఖాళీ లేకపోవడం వల్ల బాంబే బదులు బాంబ్ అని రాసుకున్నానంటూ అధికారులకు తెలిపింది. ఈ సంఘటనపై బామ్మ కుమార్తె జోతిరాజ్ మాట్లాడుతూ తన తల్లికి ఇంగ్లీష్ పూర్తిగా రాదని, చదవడం రాయడం అరకొరగా తెలుసునంటూ అధికారులకు తెలిపింది. అందుచేతనే బ్యాగ్‌పై అలా రాసుకొచ్చిందని, బాంబ్ అని రాయడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు తన తల్లికి తెలియవంటూ అధికారులకు వివరించింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. So, this caused a bit of an issue at #Brisbane airport. Police cordoned off part of the terminal after this bag popped out on the luggage belt. The passenger was coming from Mumbai, formerly Bombay. Airport code: BOM. #CommonwealthGames2018 pic.twitter.com/p7qgTFLMsX — Siobhan Heanue (@siobhanheanue) April 5, 2018 -
ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం
న్యూఢిల్లీ: బాంబు ఉందన్న అనుమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బంది.. అవి ఆటోమొబైల్ విడిభాగాలని తేల్చటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపిన వివరాలివీ.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో ఏరియాలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఓ పార్సిల్ పడి ఉండటం గమనించిన సిబ్బంది భద్రతా విభాగానికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందిని అలెర్ట్ చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తోపాటు ఎక్స్‌రే ఇమేజ్ యంత్రాన్ని తెప్పించారు. క్షుణ్నంగా పరిశీలించగా అందులో మారుతి కార్ల విడి భాగాలు ఉన్నట్లు తేలింది. ఈ ఘటనతో ఉదయం 9గంటల వరకు ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం ఆ పార్సిల్‌ను అందులో ఉన్న చిరునామా ప్రకారం విస్తారా ఫ్లయిట్లో గోవాకు పంపించారు. ఈ విమానాశ్రయంలో భద్రతా బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలు పర్యవేక్షిస్తుండగా అత్యవసర సమయాల్లో సీఐఎస్ఎఫ్ రంగంలోకి దిగుతుంది. -
‘చర్చిగేట్ బాంబు బెదిరింపు’ నిందితుడి పట్టివేత
సాక్షి, ముంబై: నగరంలో రద్దీ రైల్వే స్టేషన్లలో ఒకటైన చర్చిగేట్‌ను బాంబులతో పేలుస్తామని బెదిరింపు ఫోన్ చేసిన ఆగంతకున్ని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని బాబు ఖేంచంద్ చౌహాన్ (55)గా గుర్తించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..ఈ నెల 13వ తేదీన ఉదయం 10.44 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి రైల్వే హెల్ప్ లైన్ 182 నంబరు ఫోన్ వచ్చింది. చర్చిగేట్ రైల్వే స్టేషన్‌ను బాంబులతో పేల్చివేస్తామని చెప్పడంతో వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు జాగీలాలతో, బాంబు స్కాడ్‌తో చర్చిగేట్‌లో ఉన్న ప్లాట్‌ఫారాలు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, కార్యాలయాలు, పరిసరాలు అణవణువు గాలించారు. కానీ ఎక్కడ బాంబు దొరక్కపోవడంతో ఫేక్ కాల్‌గా భావించిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ గాలింపు పూర్తయిన తరువాత గుర్తు తెలియని వ్యక్తికి వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయడం ప్రారంభించారు. ఆ ఫోన్ మాహింలోని ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 10.44 గంటలకు పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఎవరెవరు ఫోన్ చేశారో సీసీ టీవీ కెమరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో బాబు చౌహాన్ ఒక్కడే ఆ సమయంలో ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఎట్టకేలకు 20 రోజుల తరువాత అతన్ని వలపన్ని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆ రోజు ఫోన్ చేసిన విషయాన్ని అంగీకరించాడు. ఆహ్మదాబాద్‌కు చెందిన బాబు కూలి పని కోసం కొద్ది నెలల కిందట ముంబై వచ్చాడు. దొరికిన పనిచేసుకుంటూ పుట్‌పాత్‌పై నిద్రపోయేవాడని పోలీసులు తెలిపారు. నిందితున్ని కోర్టులో హాజరు పర్చగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. -
జాబ్ కోసం స్కెచ్... అడ్డంగా దొరికిపోయాడు
అలహాబాద్: ఉద్యోగం కోసం స్కెచ్ వేసిన ఓ యువకుడు అడ్డంగా బుక్ అయ్యాడు. స్థిరత్వంలేని ఉద్యోగంతో విరక్తి చెందిన యువకుడు... శాశ్వత కొలువు పట్టేయాలని వేసిన ప్రణాళిక బెడిసికొట్టి జైలు పాలయ్యాడు. అలహాబాద్ హైకోర్టులో చిన్నాచితకా పనులు చేస్తున్న సంతోష్ కుమార్ అగ్రహారి(38) కోర్టు ప్రాంగణంలో బాంబులతో నిండిన సంచిని పెట్టి తర్వాత అతనే దాన్ని గుర్తించినట్లు అందరినీ అప్రమత్తం చేశాడు. ఎందుకంటే అతని జాగ్రత్తకు బహుమతిగా ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాడు. ఈ దెబ్బకు కోర్టు పరిసరాల్లో శుక్రవారం కలకలం రేగింది. కానీ అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించాక అసలు విషయం బయటపడింది. గురువారం రాత్రి సీసీటీవీ దృశ్యాల్లో అగ్రహారి కదలికలు అనుమానస్పదంగా కనిపించాయి. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా బాంబులున్న ప్లాస్టిక్ సంచిని అక్కడ పెట్టింది తనేనని అంగీకరించాడు. ఉద్యోగం ఆశతోనే అలా చేసినట్టు చెప్పాడు. -
రియోలో బాంబు కలకలం..!
ప్రపంచ అత్యున్నత క్రీడా సంబరాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే రియోలో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోపగబానా బీచ్ వద్ద బాంబు ఉందంటూ కలకలం రేగింది. అక్కడ ఓ బ్యాగ్ లో అనుమానిత పేలుడు పదార్థాలున్నాయని సిబ్బందికి సమాచారం రావడంతో ఆధునిక బాంబు చెకింగ్ రోబో స్క్వాడ్ లను రంగంలోకి దింపింది. కొద్దిసమయంలోనే బీచ్, చుట్టుపక్కల ప్రాంతాలను బ్రెజిల్ భద్రతా సిబ్బంది ఖాళీచేయించింది. రియో సంబరాలు ప్రారంభమైన మారకానా స్డేడియానికి మూడు మైళ్ల దూరంలో ఉన్న బీచ్ వాలీవాల్ ప్రాంతానికి దగ్గర్లోనే పురుషుల సైక్లింగ్ రేస్ నిర్వహిస్తారు. దీంతో సిబ్బంది వెంటనే అక్కడ తనిఖీలు చేసి ఆ బ్యాగులో పేలుడు పదార్థాలు లేవని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రదాడులు తీవ్రరూపం దాల్చిన తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్ గేమ్స్ కావడంతో బ్రెజిల్ తో పాటు కొన్ని అగ్రదేశాలు తమ దేశ అథ్లెట్ల రక్షణ కోసం చర్యలు చేపట్టాయి. ఇప్పటికే రియో పోలీసులు, దేశ ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాయి. అయితే ఎఫ్బీఐతో పాటు అమెరికా నిఘా ఏజెన్సీలు(దాదాపు 1000 మందిని ) రియోలో తమ తనిఖీలు ముమ్మరం చేసి బ్రెజిల్ సిబ్బందికి సహకరిస్తున్నాయి. తమ దేశం నుంచి మరికొంత మంది సిబ్బంది సెక్యూరిటీ కోసం బయలుదేరారని అమెరికా నిఘా అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరోవైపు తమ దేశంలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడంపై కొందరు నిరసనకారులు ఆగ్రహించి బ్రెజిల్ జాతీయ పతాకాన్ని దహనం చేసి తమ నిరసన తెలిపారు. -
అమెరికాలో బాంబు కలకలం!
అమెరికా వాషింగ్టన్ డీసీలోని ప్రముఖ థీమ్ పార్క్ ‘సిక్స్ ఫ్లాగ్స్ అమెరికా’ వద్ద బుధవారం బాంబు కలకలం రేగింది. ఈ థీమ్ పార్కు వద్ద బాంబులు ఉన్నట్టు అనుమానాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు వదంతులపై ప్రస్తుతం పోలీసు అధికారులకు సహకరిస్తున్నామని, థీమ్ పార్కు పూర్తిగా సురక్షితంగా ఉన్నదని నిర్ధారించుకునేవరకు దీనిని మూసివేస్తున్నామని పార్కు అధికారులు ట్విట్టర్ లో తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు థీమ్ పార్కు వద్ద రెండు అనుమానిత ప్యాకేజీలు లభించాయని, దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రిన్స్ జార్జ్ కౌంటీ అగ్నిమాపక విభాగం అధికార ప్రతినిధి మార్క్ బ్రాడీ తెలిపారు. మొదటి అనుమానిత ప్యాకేజీని తెరిచి చూడగా అందులో పేలుడు పదార్థాలు ఏమీ కనిపించలేదని, రెండో దానిని ప్రస్తుతం అధికారులు తనిఖీలు చేస్తున్నారని ఆయన చెప్పారు. -
ఈజిప్టు విమానానికి బాంబు బెదిరింపు
థష్కెంత్లో : ఈజిప్టుకు చెందిన ఎయిర్ లైన్స్ విమానం బుధవారం ఉబ్జెకిస్తాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు.. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ంగ్కు సూచించినట్లు కజిక్ మీడియా వెల్లడించింది. విమానం కైరో నుంచి బీజింగ్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఉబ్జెక్ ఎయిర్‌లైన్స్ ప్రెస్ సర్వీస్ ధ్రువీకరించింది. బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో ప్రయాణికులను దించివేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమానంలో 118 మంది ప్రయాణికులు, 17మంది విమాన సిబ్బంది ఉన్నారు. కాగా గత నెలలో 50 ప్రయాణికులతో వెళుతున్న ఈజిప్టు విమానం ఒకటి మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తుండగా అదృశ్యం అయింది. ప్యారిస్ నుండి ఈజిప్టు రాజధాని కైరోకు తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. -
కేంద్ర మంత్రి సభకు సమీపంలో బాంబు కలకలం
మాల్దా: పశ్చిమ బెంగాల్ లో మాల్దా పట్టణంలోని పోస్టాఫీసుకు సమీపంలో బాంబు ఉందనే వదంతులు వ్యాపించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనాల్సిన సభకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాంబ్ స్క్వాడ్ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తనిఖీలు చేపట్టింది. అక్కడున్న అనుమానిత బ్యాగును స్వాధీనం చేసుకొని ల్యాబ్ కు తరలించారు. ఇటీవల కాలంలో మాల్దాకు సమీపంలో ఉన్న కాలియాచాక్ లో100 మంది పోలీసుస్టేషన్ పైదాడి చేసిన ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. -
10 విమానాలకు బాంబు బెదిరింపులు!
న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. బాంబులు పేలుతాయేమోనని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. చెన్నై లోని కస్టమర్ కేర్ కు 10 ఇండిగో విమానాలకు సంబంధించి బెదిరింపు కాల్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇండిగో 6ఈ 853 అనే విమనానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు ఆ విమనాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని బాంబులు, ఏవైనా పేలుడు పదార్థాల కోసం ఇండిగో విమానంలో తనిఖీలు చేస్తున్నారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో భారత్ లో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయానికి గురువారం బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. కోల్ కతా హౌరాలోని 'నబాన్న' ప్రభుత్వ సచివాలయ కార్యాలయంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని దుండగులు కాల్ చేసి బెదిరించారు. ఈ సమయంలో సీఎం మమత సచివాలయం 14వ అంతస్తులోని తన కార్యాలయంలో ఉన్నారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సచివాలయ భవనంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బాంబు దొరకకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ ఉత్తిదేనని తేల్చారు. -
బాంబు బెదిరింపులతో స్కూల్స్ మూసివేత
-
రెండు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: రెండు విమానాలకు బుధవారం బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. ఈ రెండు విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో రెండు విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. భద్రతా కారణాలతో ఖాట్మాండుకు వెళ్లాల్సిన 9డబ్ల్యూ260 విమానాన్ని నిలిపివేసినట్టు జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. 122 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది విమానాశ్రయంలో వేచి చూస్తున్నారని వెల్లడించింది. -
ఢిల్లీ విమానంలో బాంబు కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఖాట్మాండు విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకం రేగింది. భద్రత సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి విమానంలోని 104 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందిని దించివేశారు. విమానంలో తనిఖీలు చేపడుతున్నారు. ఢిల్లీ- ఖాట్మండు విమానానికి బాంబు బెదరింపు వచ్చినట్టు బాంబు ఎసెస్మెంట్ కమిటీ ప్రకటించింది. భద్రత సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
విమానానికి బాంబు బెదిరింపు
నాగ్‌పూర్: భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న గోఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం నాగ్‌పూర్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. భద్రత సిబ్బంది వెంటనే ప్రయాణికులను దింపేసి తనిఖీ చేపట్టారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల అనంతరం విమానం ముంబైకి బయల్దేరింది. -
ఢిల్లీ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
-
ఢిల్లీ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపు రావడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. ఆదివారం ఉదయం ఢిల్లీ రైల్వే స్టేషన్లో రైళ్లను ఆపివేసి బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును బాంబుతో పేల్చివేస్తామని ముంబై ఏటీఎస్ అధికారులకు ఈమెయిల్ వచ్చింది. వారు వెంటనే రైల్వే బోర్డును అప్రమత్తం చేశారు. దీంతో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, సమీపంలో వస్తున్న రైళ్లను ఎక్కడిక్కడ ఆపివేశారు. ఘజియాబాద్ వద్ద లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేసి తనిఖీలు చేశారు. శనివారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రవాదులు దాడి చేసిన మరుసటి రోజు బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భద్రత సిబ్బంది క్షుణ్నంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. అనంతరం రైళ్లు బయల్దేరాయి. -
జర్మనీ విమానానికి బాంబు బెదిరింపు
జర్మనీకి చెందిన ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో అత్యవసరంగా దాన్ని ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దింపేసి, తనిఖీలు చేపట్టారు. బెర్లిన్ నుంచి ఈజిప్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
అమీర్‌పేట మైత్రీవనం వద్ద బాంబు కలకలం
ఎప్పుడూ సందడిగా ఉండే అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో బాంబు ఉందంటూ వచ్చిన వదంతులతో ఒక్కసారిగా కలకలం రేగింది. సత్యం థియేటర్ సమీపంలో ఒక సూట్‌కేసు అనుమానాస్పద పరిస్థితులలో కనిపిచండంతో అక్కడ ఉన్నవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు బాంబుస్క్వాడ్ చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. పాస్‌పోర్ట్ ఆపీసు ఎదురుగా ఉన్న టిఫెన్ సెంటర్‌వద్ద పడిఉన్న సూట్‌కేస్‌ను బాంబు స్వ్కాడ్ తెరిచి చూడగా అందులో ల్యాప్‌టాప్, చార్జర్, కొన్ని దుస్తులు, కాగితాలు మాత్రం ఉన్నాయి. పాస్‌పోర్ట్ పనిమీద వచ్చిన ఎవరో హడావుడిగా టిఫెన్‌చేసి సూట్‌కేస్‌ను మరిచిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సూట్‌కేస్ బాంబు ఉందని ప్రచారం జరగడంతో పాస్‌పార్ట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని స్క్వాడ్ సభ్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబుస్వ్కాడ్ వచ్చి సూట్ కేసును తెరిచి చూసే వరకూ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. -
బీబీసీ కార్యాలయం వద్ద బాంబు కలకలం
లండన్: ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ఛానెల్ బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద బాంబు కలకలం చెలరేగింది. సెంట్రల్ లండన్ లోని ఛానెల్ ఆఫీసు వద్ద ఓ అనుమానిత వాహనం గంటలకొద్ది నిలిచిఉండటంతో అందులో బాంబులు ఉన్నాయనే అనుమానం అక్కడి సిబ్బందిని వణికించింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బీబీసీ ఆఫీసుతోపాటు చుట్టుపక్కల కార్యాలయాలను ఖాళీచేయించారు. అనుమానిత కారును అణువణువూ పరిశోధించిన బాంబు స్క్వాడ్ చివరికి పేలుడు పదార్థాలేవీ లేవని తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవలి పారిస్ దాడులు, అంతకు ముందు చార్లిస్ హెబ్డో పత్రికా కార్యాలయంపై ఉగ్రపంజా ఘటనల దృష్ట్యా ప్రధాన నగరాల్లోని అన్ని పత్రికా, టీవీ ఛానెళ్ల వద్ద నిఘా పెంచిన సంగతి తెలిసిందే. -
గురుదాస్ పూర్ లో బాంబు కలకలం
గురుదాస్ పూర్: ఉగ్రవాదుల దాడి నుంచి కోలుకోకముందే పంజాబ్ లో గురుదాస్ పూర్ లో గురువారం బాంబు కలకలం రేగింది. బస్టాండ్ లో అనుమానిత బ్యాగ్ కనపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు బస్టాండ్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణికులను బయటకు పంపించారు. బ్యాగ్ లో ఏముందో తెలుసుకునేందుకు బాంబు నిర్వీర్య బృందం రంగంలోకి దిగింది. దీనాపూర్ లో సోమవారం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులతో సహా ఏడుగురు మృతి చెందారు. అంతకుముందు రైల్వే ట్రాక్ పై పేలకుండా ఉన్న బాంబులను కనుగొన్నారు. ఈ నేపథ్యంలో గురుదాస్ పూర్ బస్టాండ్ లో గుర్తించిన సంచి ఉగ్రవాదాదులు పెట్టారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.