లండన్: బాంబు భయంతో బ్రిటన్ పార్లమెంట్ ను ఖాళీ చేయించారు. పార్లమెంట్ ప్రాంగణంలో అనుమానాస్పద వస్తువు కనిపిచండంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతాధికారులు రంగంలోకి దిగి ముందు జాగ్రత్తగా ఎంపీలను పార్లమెంట్ నుంచి వెలుపలకు పంపించారు. పార్లమెంట్ ఎదురుగా ఉన్న ఆఫీసు బిల్డింగ్, వెస్ట్ మినిస్టర్ అండర్ గ్రౌండ్ స్టేషన్ ను కూడా ఖాళీ చేయించారు.
పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతాధికారులు అణువణువు సోదా చేస్తున్నారని లండన్ మెట్రో పోలీస్ అధికారులు వెల్లడించారు. అనుమానాస్పద వస్తువు కారణంగానే పార్లమెంట్ ఖాళీ చేయించామని తెలిపారు. మిగతా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. తీవ్రవాద దాడులు జరిగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో రెండో అత్యంత ప్రమాదకర హెచ్చరికను ఆగస్టులో బ్రిటన్ జారీచేసింది.ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరు నేపథ్యంలో బ్రిటన్ కు ముప్పు పెరిగింది.
బాంబు భయంతో బ్రిటన్ పార్లమెంట్ ఖాళీ
Published Mon, Nov 17 2014 5:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement