థష్కెంత్లో : ఈజిప్టుకు చెందిన ఎయిర్ లైన్స్ విమానం బుధవారం ఉబ్జెకిస్తాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు.. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ంగ్కు సూచించినట్లు కజిక్ మీడియా వెల్లడించింది. విమానం కైరో నుంచి బీజింగ్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఉబ్జెక్ ఎయిర్లైన్స్ ప్రెస్ సర్వీస్ ధ్రువీకరించింది.
బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో ప్రయాణికులను దించివేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమానంలో 118 మంది ప్రయాణికులు, 17మంది విమాన సిబ్బంది ఉన్నారు. కాగా గత నెలలో 50 ప్రయాణికులతో వెళుతున్న ఈజిప్టు విమానం ఒకటి మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తుండగా అదృశ్యం అయింది. ప్యారిస్ నుండి ఈజిప్టు రాజధాని కైరోకు తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.