కేంద్ర మంత్రి సభకు సమీపంలో బాంబు కలకలం
మాల్దా: పశ్చిమ బెంగాల్ లో మాల్దా పట్టణంలోని పోస్టాఫీసుకు సమీపంలో బాంబు ఉందనే వదంతులు వ్యాపించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనాల్సిన సభకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాంబ్ స్క్వాడ్ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తనిఖీలు చేపట్టింది. అక్కడున్న అనుమానిత బ్యాగును స్వాధీనం చేసుకొని ల్యాబ్ కు తరలించారు. ఇటీవల కాలంలో మాల్దాకు సమీపంలో ఉన్న కాలియాచాక్ లో100 మంది పోలీసుస్టేషన్ పైదాడి చేసిన ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి.