
విమానానికి బాంబు బెదిరింపు
నాగ్పూర్: భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న గోఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం నాగ్పూర్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. భద్రత సిబ్బంది వెంటనే ప్రయాణికులను దింపేసి తనిఖీ చేపట్టారు.
విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల అనంతరం విమానం ముంబైకి బయల్దేరింది.