బాంబు బెదిరింపుతో హడలిన ఉస్మానియా
Published Wed, Mar 25 2015 7:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM
హైదరాబాద్: బాంబు బెదిరింపు కాల్‌తో ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది బెంబేలెత్తి పోయారు. ఎవరో ఆకతాయి అర్ధరాత్రి సమయంలో బాంబు పెట్టినట్టు కాల్ చేయడంతో సిబ్బంది, అక్కడి రోగుల సంబంధీకులు భయంతో బయటకు పరుగులు తీశారు.
అఫ్జల్ గంజ్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రి అంతటా తనిఖీలు నిర్వహించారు. బాంబు ఏమీ లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Advertisement