సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయానికి గురువారం బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. కోల్ కతా హౌరాలోని 'నబాన్న' ప్రభుత్వ సచివాలయ కార్యాలయంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని దుండగులు కాల్ చేసి బెదిరించారు.
ఈ సమయంలో సీఎం మమత సచివాలయం 14వ అంతస్తులోని తన కార్యాలయంలో ఉన్నారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సచివాలయ భవనంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బాంబు దొరకకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ ఉత్తిదేనని తేల్చారు.