ఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇజ్రాయెల్ ఎంబస్సీపై బాంబులు వేస్తామంటూ పోలీసులకు దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు గుర్తు తెలియని వ్యక్తి అగ్ని మాపకశాఖ పోలీసులకు ఫోన్ చేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్‌లో పేలుడు సంభవించనుందని పేర్కొన్నాడు.
బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసు ప్రత్యేక సెల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. అధికారులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేయడంతో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఫోన్ కాల్‌పై సమగ్ర విచారణ జరుగుతోంది. ఢిల్లీలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఉంది.
ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక?
Comments
Please login to add a commentAdd a comment