Embassy officials
-
యూఎస్ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు
భారత్ నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2024లో ఇప్పటివరకు 12 లక్షల మంది అమెరికా వచ్చినట్లు యూఎస్ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. వీసాల కోసం పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతోందన్నారు. దాంతో భారతీయ ప్రయాణికుల కోసం అదనంగా 2,50,000 వీసా అపాయింట్మెంట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటక ప్రకారం..2024లో ఇప్పటివరకు 1.2 మిలియన్లకు(12 లక్షలు) పైగా భారతీయులు యుఎస్‌కు వచ్చారు. 2023లో ఇదే కాలంతో పోలిస్తే వీరి సంఖ్య 35 శాతం పెరిగింది. సుమారు 60 లక్షల మంది భారతీయులు యూఎస్‌ను సందర్శించడానికి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నారు. పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థుల నుంచి వీసాల కోసం భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. దాంతో భారతీయ ప్రయాణికుల కోసం అదనంగా 2,50,000 వీసా అపాయింట్మెంట్లను కేటాయించారు.ఈ సందర్భంగా యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ..‘ఇండియా-యూఎస్ మిషన్‌లో భాగంగా గడిచిన రెండేళ్లలో పది లక్షల మంది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది వేసవిలో స్టూడెంట్ వీసాలను రికార్డు స్థాయిలో ప్రాసెస్ చేశాం. ఇరు దేశాల మధ్య వ్యాపారాలను సులభతరం చేయడానికి, పర్యాటకాన్ని పెంపొందించడానికి దృష్టి సారిస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరు దేశాల మధ్య వీసా ప్రక్రియను మెరుగుపరచాలని, వేగవంతం చేయాలని నిర్దేశించారు. ఇండియా నుంచి అమెరికా రావాలనుకుంటున్న వారి డిమాండ్‌ను తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!అమెరికా గతంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం..అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు జారీ చేసిన మొత్తం 6,00,000 విద్యార్థి వీసాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారతీయులే ఉండడం విశేషం. సందర్శకుల వీసా అపాయింట్మెంట్ల కోసం వేచి ఉండే సమయాన్ని 75 శాతానికి తగ్గించారు. -
అట్లాంటా భారత రాయబార అధికారులను కలిసిన నాట్స్ బృందం
అట్లాంటాలోని భారతీయ రాయబార అధికారి రమేశ్ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నాయకులు కలిసి నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అట్లాంటా నాట్స్ నాయకులు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేశ్ పెద్ది, అట్లాంటా నాట్స్ నాయకులు ఇండియన్ కాన్సులేట్ అధికారులతో చర్చించారు. నాట్స్ హెల్ప్ లైన్, అమెరికాకు వచ్చే విద్యార్ధులకు చేయాల్సిన, చేయకూడని పనులపై అవగాహన, గృహహింస బాధితులకు అండగా నిలబడటం, మానసిక పరిణితి పెంచేలా సదస్సులు, ప్రతిభ గల విద్యార్ధులకు పురస్కారాలు, స్థానిక కమ్యునిటీ సేవలు ఇవన్నీ నాట్స్ ఎలా చేస్తుంది..? అమెరికాలో తెలుగుజాతికి ఎలా అండగా నిలబడుతుందనే విషయాలను కాన్సులేట్ అధికారులకు వివరించారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్న అట్లాంటా భారత రాయబార కార్యాలయాన్ని నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించింది. ప్లోరిడాలో కూడా భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించే కార్యక్రమాల్లో నాట్స్ చురుకుగా పాల్గొంటుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు.. భారత రాయబార కార్యాలయంతో తమ అనుబంధం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని ప్రశాంత్ వ్యక్తం చేశారు.(చదవండి: ఆఫ్రికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు)a -
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు
ఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇజ్రాయెల్ ఎంబస్సీపై బాంబులు వేస్తామంటూ పోలీసులకు దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు గుర్తు తెలియని వ్యక్తి అగ్ని మాపకశాఖ పోలీసులకు ఫోన్ చేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్‌లో పేలుడు సంభవించనుందని పేర్కొన్నాడు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసు ప్రత్యేక సెల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. అధికారులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేయడంతో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఫోన్ కాల్‌పై సమగ్ర విచారణ జరుగుతోంది. ఢిల్లీలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఉంది. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
భారతీయులకు 10 లక్షల వీసాల జారీ
న్యూఢిల్లీ: భారత్‌లో 2023లో 10 లక్షల నాన్ ఇమిగ్రంట్ వీసాలను జారీ చేయాలన్న లక్ష్యాన్ని అధిగమించినట్లు అమెరికా ఎంబసీ తెలిపింది. ఇదే ఒరవడిని ఇకపైనా కొనసాగిస్తామని ప్రకటించింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో తమ కుమారుడి స్నాతకోత్సవానికి హాజరవుతున్న పునీత్ దర్గన్, డాక్టర్ రంజుసింగ్ దంపతులకు 10 లక్షలవ వీసాను గురువారం భారత్‌లో తమ రాయబారి గార్సెట్టి అందజేశారని వెల్లడించింది. లేడీ హార్డింజ్ కాలేజీలో సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ రంజు సింగ్‌కు 10 లక్షలవ వీసా, ఆమె భర్త పునీత్ దర్గన్కు ఆ తర్వాతి వీసా జారీ అయ్యాయని వివరించింది. ప్రపంచదేశాల నుంచి అమెరికాకు అందే మొత్తం వీసా దరఖాస్తుల్లో 10 శాతం భారత్ నుంచే అని ఎంబసీ ప్రకటించింది. మొత్తం విద్యార్థి వీసాల్లో 20 శాతం, హెచ్ అండ్ ఎల్ కేటగిరీ(ఉద్యోగాలు)లో 65 శాతం భారతీయులవేనని కూడా తెలిపింది. 2019 కోవిడ్‌కి ముందుకంటే ఈసారి 20 శాతం ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది 12 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారని పేర్కొంది. కోవిడ్ కారణంగా వీసాల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో తలెత్తిన డిమాండ్‌ను అధిగమించేందుకు చెన్నై కాన్సులేట్‌లో అదనపు సిబ్బంది నియామకం, హైదరాబాద్‌లో విశాలమైన భవనంలో నూతన కాన్సులేట్‌ను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయగలిగామని వివరించింది. -
ఇకపై నెలకు లక్ష వీసాలు జారీ
న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు ఇక బాగా తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారి ఒకరు వెల్లడించారు. 2023 ఏడాది వేసవి నాటికి వీసా దరఖాస్తులు 12 లక్షలకు చేరుకుంటాయన్న అంచనాలున్నాయని తెలిపారు. కోవిడ్–19 కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం, వీసాల జారీ తాత్కాలికంగా నిలిపివేత వంటి కారణాలతో భారతీయులు వీసాల కోసం ఏడాదికి పైగా ఎదుచు చూడాల్సిన పరిస్థితి ఉంది. ‘వీసాల మంజూరులో భారత్‌కు మేము అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వచ్చే ఏడాది నాటికి కరోనా కంటే ముందున్న పరిస్థితులు వస్తాయి. నెలకి లక్ష వీసాలు మంజూరు చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. వీసాల త్వరితగతి మంజూరు కోసం సిబ్బందిని పెంచడం, డ్రాప్ బాక్స్ సదుపాయం కల్పన వంటి చర్యల్ని తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు గతంలో కొన్ని కేటగిరీల వీసా కోసం 450 రోజులు ఎదరుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడది తొమ్మిది నెలలకి తగ్గిందని వివరించారు. -
‘చైనీస్’ వైరస్‌పై ఘాటుగా స్పందించిన రోంగ్
న్యూఢిల్లీ : చైనాలోని వుహాన్ కేంద్ర బిందువుగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 21 వేలకు పైగా మృతిచెందారు. అయితే ఈ కరోనా వైరస్ అనేది చైనా సృష్టించిన జీవాయుధం అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురించాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనాను ‘చైనీస్ వైరస్’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై భారత్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జీ రోంగ్ స్పందించారు. కరోనా వైరస్‌ను చైనా సృష్టించలేదని, ఉద్దేశపూర్వకంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేయలేదని అన్నారు. కరోనాను చైనీస్ వైరస్, వుహాన్ వైరస్ అని పిలవడ్డాన్ని ఆయన తప్పుబట్టారు. అంతర్జాతీయ సమాజం చైనా ప్రజలను నిందించడం మానుకోని.. కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కొవాలనేదానిపై దృష్టి పెట్టాలని సూచించారు. కరోనాపై పోరాటంలో చైనా, భారత్‌లు సమాచార మార్పిడితో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. క్లిష్ట సమయాల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి సహకారం అందించుకుంటున్నాయని తెలిపారు. చైనాకు భారత్ వైద్య సామాగ్రిని అందించి కరోనా పోరాటానికి మద్దతుగా నిలిచిందని వెల్లడించారు. అందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. చైనాను ఉద్దేశించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కొందరు అధికారులు చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని రోంగ్ కోరారు. కరోనా నివారణకు చైనా చేస్తున్న ప్రయత్నాలు కించపరచాలని చూస్తున్నవారు.. గతంలో మానవజాతి ఆరోగ్యం కోసం చైనా ప్రజలు చేసిన త్యాగాలను విస్మరించారని అన్నారు. చదవండి : ఢిల్లీలో ఆ డాక్టర్ కుటుంబానికి కరోనా చైనాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ! -
మూణ్నెల్లు ముందే వీసాకు దరఖాస్తు
న్యూఢిల్లీ: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుం టున్న భారతీయ వృత్తి నిపుణులు, ముఖ్యంగా టెకీలకు శుభవార్త. ఉద్యోగంలో చేరడానికి మూడు నెలలు ముందు కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా కల్పించింది. తమ దేశంలో ఎలాంటి ఉద్యోగం చేసే భారతీయులైనా 90 రోజులు ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటిం చింది. అమెరికా కంపెనీలు ప్రత్యేక సాంకేతిక నిపుణులైన విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకునేందుకు హెచ్1–బీ వీసాను వాడుకుంటుంటాయి. అమెరికా ప్రభుత్వం ఏటా జారీ చేసే 85వేల హెచ్1–బీ వీసాల్లో ఏకంగా 70 శాతం భారతీయులకే అందుతుండటం గమనార్హం. దీంతో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ వర్క్ వీసా అంశం కూడా కీలకంగా మారింది. -
కామారెడ్డి వాసి మృతదేహం తరలింపుకు తొలగిన అడ్డంకి
సాక్షి, కామారెడ్డి : ఈ నెల 2న బహరాస్‌లో జరిగిన ప్రమాదంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు(37) మృతి చెందాడు. రంజాన్ సెలవులు ఉండటంతో మృతదేహాన్ని భారత్‌కు పంపే ప్రక్రియలో జాప్యం జరిగింది. దాంతో మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి పంపించాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఇండియన్ ఎంబసీకి, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్య శాఖకు ‘మదద్’ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన బహరాస్ ఎంబసీ ప్రభుత్వం నుంచి డెత్ సర్టిఫికెట్ అందాల్సి ఉందని.. అది రాగానే మృత దేహాన్ని భారత్‌కు పంపడానికి తగిన చర్యలు తీసుకుంటామాని భీం రెడ్డికి ఈ మెయిల్ ద్వారా తెలిపింది. పని నిమిత్తం బహరాస్ వెళ్లిన రాజు ఈ నెల 2 యాక్సిడెంట్‌కు గురయ్యాడు. డ్రైవర్ చూసుకోకుండా ట్రక్కును నడపడం వలన వెనక టైరు కింద పడ్డ రాజు తల నుజ్జు నుజ్జు అయింది. దాంతో రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు రాజుకు భార్య లావణ్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. ప్రవాసీ బీమాకు దూరం ఈసీఆర్(ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్) పాస్‌పోర్టు కలిగిన రాజు.. చట్టబద్దమైన ఇ-మైగ్రేట్ సిస్టం ద్వారా కాకుండా అక్రమ పద్దతిలో పుషింగ్ ద్వారా బహరాస్‌కు వెళ్లాడు. ఫలితంగా ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 10 లక్షలు విలువ చేసే ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’(పీబీబీవై) ప్రయోజానికి అనర్హుడు కావడంతో బీమా ప్రయోజనం పొందలేకపోతున్నాడు. మూడున్నర నెలల క్రితం ‘జాస్కో’ కంపెనీలో ఉద్యోగంలో చేరిన రాజు.. ఇలా అనూహ్యంగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. రైతుబంధులాగా ప్రవాసీలను ఆదుకోవాలి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రూ. 5 లక్షల రైతు బీమా ఇచ్చినట్లుగానే గల్ఫ్ ప్రవాసీ కార్మికులకు కూడా రూ. 5 లక్షల బీమా లేదా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ సురేందర్ సింగ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో తెలంగాణకు చెందిన సుమారు వెయ్యి మంది ప్రవాసీలు గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ధన సహాయం అందలేదని పేర్కొన్నారు.ఇబ్బందుల్లో ఉన్న గల్ప్ కార్మికులు తన ఫోరం హెల్ప్ లైన్ నంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు. హెల్ప్‌లైన్ నంబర్ - 93912 03187 మంద భీంరెడ్డి - 98494 22622 -
కువైట్ నుంచి విముక్తి పొంది స్వదేశానికి
విదేశంలో అనారోగ్యానికి తోడు కోర్టు కేసులో చిక్కుకున్న రాష్ట్రవాసి సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యానికి తోడు కోర్టు కేసు కూడా ఎదురుకావడంతో దేశం కాని దేశంలో నిస్సహాయుడిగా మారిన ఓ అభ్యాగుడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో స్వదేశానికి రప్పించింది. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పచ్చల నడ్కుడ వాసి మెడవేటి ప్రశాంత్ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లా రు. కొంత కాలానికి 2 మూత్రపిండాలూ చెడిపోయి అనారోగ్యా నికి గురై అక్కడి ఆస్పత్రిలో చికిత్సకు చేరాడు. ప్రశాంత్‌ను స్వదే శానికి తరలించేందుకు సహకరించాలని అతడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేయడంతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ అప్పట్లో ఈ విష యాన్ని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ప్రశాంత్‌పై కువైట్‌లో ఓ కేసు విచారణ జరుగుతోం దని, దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని అతడు చెల్లించాల్సి ఉందని ఎంబసీ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ప్రశాంత్ చెల్లించాల్సిన బకాయిలను మన రాయబార కార్యాలయం చెల్లించడంతో అతడికి కేసు నుంచి విముక్తి లభించింది. దీంతో ప్రశాంత్‌ను బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొ చ్చారు. నిమ్స్‌కి తరలించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.