న్యూఢిల్లీ: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుం టున్న భారతీయ వృత్తి నిపుణులు, ముఖ్యంగా టెకీలకు శుభవార్త. ఉద్యోగంలో చేరడానికి మూడు నెలలు ముందు కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా కల్పించింది. తమ దేశంలో ఎలాంటి ఉద్యోగం చేసే భారతీయులైనా 90 రోజులు ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటిం చింది. అమెరికా కంపెనీలు ప్రత్యేక సాంకేతిక నిపుణులైన విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకునేందుకు హెచ్1–బీ వీసాను వాడుకుంటుంటాయి. అమెరికా ప్రభుత్వం ఏటా జారీ చేసే 85వేల హెచ్1–బీ వీసాల్లో ఏకంగా 70 శాతం భారతీయులకే అందుతుండటం గమనార్హం. దీంతో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ వర్క్ వీసా అంశం కూడా కీలకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment