రియోలో బాంబు కలకలం..! | Suspicious package brings chaos to Copacabana and raises tensions in Rio | Sakshi
Sakshi News home page

రియోలో బాంబు కలకలం..!

Published Sat, Aug 6 2016 4:56 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

రియోలో బాంబు కలకలం..!

రియోలో బాంబు కలకలం..!

ప్రపంచ అత్యున్నత క్రీడా సంబరాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే రియోలో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోపగబానా బీచ్ వద్ద బాంబు ఉందంటూ కలకలం రేగింది. అక్కడ ఓ బ్యాగ్ లో అనుమానిత పేలుడు పదార్థాలున్నాయని సిబ్బందికి సమాచారం రావడంతో ఆధునిక బాంబు చెకింగ్ రోబో స్క్వాడ్ లను రంగంలోకి దింపింది. కొద్దిసమయంలోనే బీచ్, చుట్టుపక్కల ప్రాంతాలను బ్రెజిల్ భద్రతా సిబ్బంది ఖాళీచేయించింది. రియో సంబరాలు ప్రారంభమైన మారకానా స్డేడియానికి మూడు మైళ్ల దూరంలో ఉన్న బీచ్ వాలీవాల్ ప్రాంతానికి దగ్గర్లోనే పురుషుల సైక్లింగ్ రేస్ నిర్వహిస్తారు. దీంతో సిబ్బంది వెంటనే అక్కడ తనిఖీలు చేసి ఆ బ్యాగులో పేలుడు పదార్థాలు లేవని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఐఎస్ఐఎస్ ఉగ్రదాడులు తీవ్రరూపం దాల్చిన తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్ గేమ్స్ కావడంతో బ్రెజిల్ తో పాటు కొన్ని అగ్రదేశాలు తమ దేశ అథ్లెట్ల రక్షణ కోసం చర్యలు చేపట్టాయి. ఇప్పటికే రియో పోలీసులు, దేశ ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాయి. అయితే ఎఫ్బీఐతో పాటు అమెరికా నిఘా ఏజెన్సీలు(దాదాపు 1000 మందిని ) రియోలో తమ తనిఖీలు ముమ్మరం చేసి బ్రెజిల్ సిబ్బందికి సహకరిస్తున్నాయి.

తమ దేశం నుంచి మరికొంత మంది సిబ్బంది సెక్యూరిటీ కోసం బయలుదేరారని అమెరికా నిఘా అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరోవైపు తమ దేశంలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడంపై కొందరు నిరసనకారులు ఆగ్రహించి బ్రెజిల్ జాతీయ పతాకాన్ని దహనం చేసి తమ నిరసన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement