ఉగ్రవాదుల దాడి నుంచి కోలుకోకముందే పంజాబ్ లో గురుదాస్ పూర్ లో గురువారం బాంబు కలకలం రేగింది.
గురుదాస్ పూర్: ఉగ్రవాదుల దాడి నుంచి కోలుకోకముందే పంజాబ్ లో గురుదాస్ పూర్ లో గురువారం బాంబు కలకలం రేగింది. బస్టాండ్ లో అనుమానిత బ్యాగ్ కనపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు బస్టాండ్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణికులను బయటకు పంపించారు. బ్యాగ్ లో ఏముందో తెలుసుకునేందుకు బాంబు నిర్వీర్య బృందం రంగంలోకి దిగింది.
దీనాపూర్ లో సోమవారం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులతో సహా ఏడుగురు మృతి చెందారు. అంతకుముందు రైల్వే ట్రాక్ పై పేలకుండా ఉన్న బాంబులను కనుగొన్నారు. ఈ నేపథ్యంలో గురుదాస్ పూర్ బస్టాండ్ లో గుర్తించిన సంచి ఉగ్రవాదాదులు పెట్టారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.