ట్రాక్టర్‌తో విన్యాసం.. అతడి ప్రాణం తీసింది | Man crushed to death while performing tractor stunt in Punjab | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌తో విన్యాసం.. అతడి ప్రాణం తీసింది

Published Mon, Oct 30 2023 5:29 AM | Last Updated on Mon, Oct 30 2023 11:06 AM

Man crushed to death while performing tractor stunt in Punjab - Sakshi

చండీగఢ్‌: ట్రాక్టర్‌తో విన్యాసం చేస్తూ ఓ వ్యక్తి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా సర్చుర్‌లో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌(29) గ్రామంలో జరుగుతున్న ఉత్సవంలోని మైదానంలో ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తున్నాడు.

స్టంట్స్‌లో నిపుణుడైన సుఖ్‌మన్‌దీప్‌ ముందుగా తన ట్రాక్టర్‌ రెండు చక్రాలను గాల్లోకి లేపి కిందికి దిగాడు. ఆ వాహనం గిరగిరా తిరుగుతుండగానే తిరిగి టైరుపైకి కాలుపెట్టి డ్రైవర్‌ సీట్లో కూర్చునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారీ ట్రాక్టర్‌ వెనుక చక్రాల కిందపడిపోయాడు. వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్‌ అతడిపైకి పలుమార్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.  ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇలాంటి తరహా వినాస్యాలు చేయకుండగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement